
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె రోజుకు కచ్చితంగా 8 గంటలు మాత్రమే పని చేస్తానని, అంతకు మించి వర్క్ చేయడం తనకు కుదరదని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వర్కింగ్ అవర్స్ కారణంగానే దీపికా రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను చేజార్చుకున్నారనే ప్రచారం జరిగింది.
వాటిలో ఒకటి ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్, రెండోది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న కల్కి 2. వర్కింగ్ అవర్స్‌తో పాటు దీపికా కొన్ని ప్రత్యేక డిమాండ్స్ కూడా పెట్టారని, వాటిని తీర్చాలని ఆమె కోరడంతో మేకర్స్ ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, చివరకు ఆ రెండు సినిమాల నుంచి ఆమెను తప్పించారనే టాక్ వినిపించింది.
ఈ విషయంలో కొందరు దీపికాను సమర్థిస్తే, మరికొందరు మాత్రం ఆమె వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నెగటివ్ ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. 8 గంటల వర్క్ విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండడం ప్రాక్టికల్‌గా కష్టం అని రణ్‌వీర్ అభిప్రాయపడ్డారు.
అయితే రణ్‌వీర్ ఈ కామెంట్స్ ఇప్పుడే చేయలేదు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడగా, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది వర్కింగ్ అవర్స్ విషయంలో ఫిర్యాదులు చేస్తుంటారని, 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10–12 గంటలు పని చేయించుకుంటున్నారని అంటారని, కానీ అనుకున్న పని 8 గంటల్లో పూర్తికాకపోతే కొంత అదనపు సమయం కేటాయించాల్సి వస్తుందని, ప్రతిసారి కచ్చితంగా 8 గంటలే అంటే పనులు ముందుకు సాగవని రణ్‌వీర్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Recent Random Post:















