వార్ 2లో అనిల్ కపూర్ పాత్రపై సస్పెన్స్, ఆగస్ట్ 14న భారీ రిలీజ్

Share


ఇండియన్ స్పై యాక్షన్ సినిమాల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న “వార్ 2” ఇప్పటికే బిజినెస్, కాస్టింగ్, ప్రమోషన్స్ పరంగా టాప్ మూవీగా నిలుస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ ఈ సినిమా హైలైట్‌గా మారింది. ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో, హృతిక్ రోషన్ ఫుల్ ఎనర్జీతో కనిపించనున్నారని టీజర్, ట్రైలర్‌ల నుంచే స్పష్టమైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌కు తోడు కియారా అద్వానీ గ్లామర్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అదనంగా, ఒక సీనియర్ స్టార్ స్పెషల్ సీక్రెట్ రోల్ చేస్తున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఈసారి మరో సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా అలియా భట్, శర్వారి వాఘ్ క్యామియోల్లో కనిపించబోతున్నారని సమాచారం. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ఇద్దరి పాత్రలు యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో వచ్చే తదుపరి సినిమా “ఆల్ఫా” కి లింక్ అవుతాయని, వార్ 2 కథను మరింత పెద్ద కాన్వాస్‌కి తీసుకెళ్తాయని టాక్. టైగర్, పఠాన్, కబీర్ లాంటి పాత్రలను ఇప్పుడు యూనివర్స్‌గా కలిపే ప్రయత్నం మొదలయ్యిందన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి.

ట్రైలర్‌లో ఎక్కువగా దృష్టిని ఆకర్షించిన విషయం సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పాత్ర. ట్రైలర్‌ని రాయల్‌గా కట్ చేయడంతో ఆయన క్యారెక్టర్‌పై సస్పెన్స్ పెరిగింది. గత సినిమాల్లో RAW చీఫ్‌గా కనిపించిన అశుతోష్ రాణా స్థానంలో ఇప్పుడు అనిల్ కపూర్ ఉన్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరో టాక్ ప్రకారం, ఆయన కొత్త డివిజన్‌కు హెడ్ అయి ఉండి, కబీర్ (హృతిక్) – విక్రమ్ (ఎన్టీఆర్) ల మధ్య జరిగే పవర్ గేమ్‌లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. మరికొందరు అభిమానులు అయితే, కల్నల్ లూత్రాతో కనెక్ట్ అయ్యే సీక్రెట్ బ్యాక్‌స్టోరీతో ఆయన క్యారెక్టర్‌ను లింక్ చేస్తున్నారు.

అనిల్ కపూర్ క్యారెక్టర్ చుట్టూ నడుస్తున్న ఈ మిస్టరీ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఆయన మూడో టీమ్‌కి లీడర్ అయి, కథలో పెద్ద ట్విస్ట్ తీసుకురావచ్చన్న వదంతులు హైప్ పెంచేశాయి. ఇక కియారా అద్వానీ బికినీ గ్లామర్, ఎన్టీఆర్ విలన్‌గా చూపించిన ఇన్‌టెన్సిటీ, హృతిక్ రోషన్ స్టైలిష్ యాక్షన్ ఇలా అన్నీ కలిపి “వార్ 2” ను ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిపాయి.

స్పై యూనివర్స్ ఎక్స్‌పాన్షన్, క్యాస్టింగ్ ట్విస్ట్‌లు, హై వోల్టేజ్ యాక్షన్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అనిల్ కపూర్ పాత్ర రహస్యం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే బయటపడనుంది. “వార్ 2” ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. అదే రోజున రజనీకాంత్ “కూలీ” కూడా విడుదల కాబోతోంది.


Recent Random Post: