
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీరలోని క్లైమాక్స్ యాక్షన్ సీన్ గుర్తుందా? “ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు.. లెక్క తక్కువ కాకుండా చూస్కో!” అంటూ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో అంత భారీ యాక్షన్ సీన్ హాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరూ ట్రై చేయలేదు. దర్శకుడు రాజమౌళి మగధీరలో ఆ యాక్షన్‌ను క్రియేట్ చేసి సంచలనం రేపారు.
ఇప్పుడు వార్ 2 లోనూ ఎన్టీఆర్‌పై అలాంటి మాస్ యాక్షన్ సీన్ ఉందని సినీ వర్గాల్లో వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. సమాచారం మేరకు, సముద్రంలోని ఓడపై తారక్ వంద మందిని మట్టికరిపించే ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచేలా రూపొందించారని, ఈ ఫైట్‌లో తారక్ ఏ విధంగా వందమందిని ఎదుర్కొంటాడు అన్నది ఉత్కంఠ రేపనుందంటున్నారు.
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఈ గ్రాండ్ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశాడని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో తారక్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని, బాలీవుడ్ మీడియాలో అయితే తారక్ విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
తాజాగా ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తిచేసుకొని వార్ 2 షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దేవరలోనూ ఎన్టీఆర్‌కు హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని, ముఖ్యంగా తారక్ జాలర్లతో తలపడే సన్నివేశాలు ఫుల్ మాస్‌గా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ దృశ్యాలను దర్శకుడు కొరటాల శివ డిజైన్ చేశారని, అదే ఇప్పుడు వార్ 2 లోనూ ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
ఇటీవలే వార్ 2 కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్, హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన అట్రాక్షన్ అవుతుందా? ఎన్టీఆర్ పాత్ర నిజంగానే విలన్ రోల్లో ఉందా? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఈ వార్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేస్తున్నాయి!
Recent Random Post:














