
బాలీవుడ్‌లో విడుదలకు ముందే భారీ అంచనాలు, మల్టీస్టారర్ క్రేజ్ సృష్టించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. నిర్మాత ఆదిత్య చోప్రాకు గణనీయమైన నష్టాన్ని మిగిల్చిన ఈ చిత్రం, అంచనాల పావువంతు కూడా అందుకోలేకపోవడం పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా గురించి ప్రస్తావన కూడా రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటే, హృతిక్ రోషన్ మాత్రం తరచూ వార్ 2ను గుర్తు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
దుబాయ్‌లో జరిగిన తాజా ఈవెంట్‌లో ‘సూపర్ స్టార్’గా తనను సంబోధించిన యాంకర్‌కు స్పందిస్తూ, తన తాజా సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా నడవలేదని పరోక్షంగా వార్ 2ను గుర్తు చేశాడు. దీంతో అక్కడి ప్రేక్షకులు నవ్వులతో స్పందించారు.
ఇదే తరహాలో సోషల్ మీడియాలో కూడా హృతిక్ వార్ 2 గురించి మాట్లాడటం, తారక్ అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది.
అయితే హృతిక్ కెరీర్‌లో కైట్స్ వంటి మరింత పెద్ద ఫ్లాపులు ఉన్నప్పటికీ, ఇప్పుడు వార్ 2పై ఇంతగా స్పందించడం కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మూడు వందల కోట్ల వసూళ్లు వచ్చినా, భారీ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్‌ను అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటిటీలో కూడా సమానమైన స్పందనే పొందింది.
Recent Random Post:















