
తాజాగా కాశ్మీర్‌లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిపై బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతమందికి సమర్ధనగా అనిపించగా, మరికొందరికి అసహ్యంగా ఉన్నాయి.
విజయ్ తన మొదటి ట్వీట్లో పాకిస్థాన్‌లో నివసించే భారతీయుల గురించి ఆలోచించాల్సిన అవసరముందని, వాళ్లు కూడా శాంతి, సంతోషాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఇక్కడ మన దేశంలో అమాయకులు చనిపోతుంటే, పాకిస్థాన్ లో వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నావు?” అని ప్రశ్నించారు. అంతేకాదు, 50 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారన్న నిజానికి ఆధారాలేంటంటూ విజయ్ను టార్గెట్ చేశారు.
తన వ్యాఖ్యలపై వచ్చిన నెగటివ్ స్పందనను గమనించిన విజయ్ ఆంటోని, వెంటనే తన స్టాండ్ మార్చారు. మరో ట్వీట్ ద్వారా దేశ భద్రతకు మద్దతు తెలుపుతూ, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మార్పు నేపథ్యంలో ప్రజలు స్పందన ఇచ్చే సమయంలో నాయకులు అయినా, ప్రముఖులు అయినా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భావోద్వేగ సమయంలో చిన్న తప్పు కూడా పెద్ద దుమారంగా మారవచ్చని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.
Recent Random Post:














