విజయ్ ‘జననాయగన్’ ట్రైలర్: రికార్డుల మోత, వివాదాల హీట్

Share


తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘జననాయగన్’ పేరు గట్టిగా మారుమోగుతోంది. అగ్ర హీరో విజయ్ నుంచి రాబోతున్న చివరి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న రాత్రి విడుదలైన ‘జననాయగన్’ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారి, వ్యూస్-లైక్స్ పరంగా తమిళ ట్రైలర్ల రికార్డులను దాటేస్తోంది. ట్రైలర్ చూసిన విజయ్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.

విజయ్ మార్కు కమర్షియల్ అంశాలతో పాటు, ఆయన రాజకీయ ప్రయాణానికి అనుకూలంగా ఉండే కంటెంట్‌ను జోడించి ఇది ఒక పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఫిలింగా రూపుదిద్దుకుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే మరోవైపు విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్ కాదా అన్న చర్చకు ట్రైలర్‌తో స్పష్టత వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లొకేషన్లు, షాట్లు, డైలాగ్స్, ప్రధాన పాత్రల మేకోవర్ వరకు ఒరిజినల్‌ను అనుసరించినట్లు కనిపిస్తోందని తెలుగు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇంతవరకూ సన్నివేశాలు తీసుకుని కూడా రీమేక్ కాదని ప్రకటించడం సరైంది కాదని వారు కౌంటర్లు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ట్రైలర్‌ను ఏఐ సాయంతో కట్ చేసిన అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ట్రైలర్‌లో ఒక చోట ‘జెమిని’ ఏఐ టూల్ వాటర్‌మార్క్ కనిపించడంతో, నెటిజన్లు దీన్ని వెంటనే గుర్తించారు. ఇంత పెద్ద సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ వాటర్‌మార్క్ తొలగించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ ‘జననాయగన్’ టీంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Recent Random Post: