
కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జన నాయకన్’ చుట్టూ సెన్సార్ వివాదం కొనసాగుతూనే ఉంది. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీబీఎఫ్‌సీ సవాల్ చేసి స్టే విధించడంతో జన నాయకన్ విడుదలపై మళ్లీ నీలినీడులు ఏర్పడాయి. దీంతో విజయ్ అభిమానులు సెన్సార్ బోర్డ్ మరియు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుస్తున్నారు. సినిమా రిలీజ్ ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కొలీవుడ్ స్టార్‌లు కూడా విజయ్‌కి మద్దతుగా నిలబడడంతో వివాదం మరింత ఊహించని స్థాయికి చేరింది.
సీబీఎఫ్‌సీ సొలిసిటర్ జనరల్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మద్రాస్ హైకోర్టు జన నాయకన్ సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలికంగా స్టే విధించింది మరియు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. సంక్రాంతి పండుగ సీజన్ ముగియబోతున్న సమయంలో విడుదల ఆలస్యం కావడంతో, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యలో, కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు, ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కళాకారులకు, కళలకు, రాజ్యాంగానికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుందని, కానీ నేడు కొందరు దీన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన సమస్య కాకుండా, కళాకారుల స్థానం, సృజనాత్మకతపై ప్రభావం చూపుతున్నదని కౌంటర్ చేశారు.
కమల్ హాసన్ చెప్పారు, సినిమా కేవలం వ్యక్తి కృషి మాత్రమే కాదు, రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిన్న వ్యాపారాలు కలిసి చేసే సమిష్టి కృషి. స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటుపడుతుంది, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారత్‌లోని సినీ ప్రేమికులు కళలకు గొప్ప ప్రేమ, గౌరవం చూపుతారు.
అతను స్పష్టంగా సూచించారు: “సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత మరియు గౌరవం ఉండాలి. నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి, అభ్యంతర సీన్‌లకు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమకు మున్ముందుకు రావడానికి ఇది అవసరం. మన వాయిస్‌ను ప్రభుత్వాలకు వినిపించాలి, రాజ్యాంగ విలువలకు లోబడి మన గొంతుకను పలు రంగాలకు వినిపించాలి, ప్రభుత్వం తో చర్చించాలి” అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
Recent Random Post:















