
ఇప్పటి కాలంలో మాట spoken అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తాజా ఉదంతం మరోసారి గుర్తుచేసింది. మన అభిప్రాయాలు, భాషలోని పదాలు ఎవరినైనా బాధించే విధంగా ఉంటే వాటికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సోషల్ మీడియాలోనూ, పబ్లిక్ వేదికలపైనా సెలబ్రిటీలు ప్రతి పదం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా యువ హీరో విజయ్ దేవరకొండ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న “రెట్రో” సినిమా ప్రమోషన్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, “500 ఏళ్ల క్రితం ఆదివాసులు ఎలా దాడి చేసారో అలా దాడి చేశారు” అనే వ్యాఖ్య చేశారు. ఈ మాటలు పెద్ద వివాదంగా మారాయి. ప్రత్యేకంగా “ఆదివాసీలు” అన్న పదం ఆ సంఘం మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యాఖ్యలపై ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో న్యాయవాది కిషన్ లాల్ చౌహన్, ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు కానీ న్యాయ సలహా కోసం వేచి చూస్తున్నారు.
ఇక మన్యం జిల్లాలోని ఆదివాసీ జేఏసీ కూడా విజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై సెలబ్రిటీలు వేదికలపై మాట్లాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post:














