
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా నిలిచే విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత, ఆయన వ్యక్తిగత జీవితంపై విస్తృత చర్చలు సోషల్ మీడియాలో మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి వార్తలపై ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగమ్ (TVK) పార్టీ అధికారికంగా స్పందించింది. పార్టీ వర్గాలు, అనవసర ఊహాగానాలకు ముగింపు పలకాలని స్పష్టంగా వెల్లడించాయి.
ప్రకటనలో, తమ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం పూర్తిగా ‘అనవసరం’ అని పార్టీ పేర్కొంది. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగానే గౌరవించాల్సినవి అని, వాటిని బహిరంగ చర్చల్లోకి తేవడం సరికాదని, ప్రతి ఒక్కరి ప్రైవసీని కాపాడటం ప్రజాస్వామ్యంలో కనీస ధర్మమని తెలిపింది.
పార్టీని దృష్టి ప్రస్తుతం ప్రజా సేవ, రాజకీయ కార్యకలాపాలపై మాత్రమే ఉందని TVK స్పష్టం చేసింది. వ్యక్తిగత వార్తల కంటే ప్రజల జీవితంపై ప్రభావం చూపే సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలి అని పేర్కొంది. వచ్చే ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో, పార్టీ విధానాలు, సుపరిపాలన, ప్రజల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయమని, అనవసర రూమర్లపై దృష్టి పెట్టకూడదని ష్రేణులకు సూచించింది.
మద్దతుదారులు మరియు సామాన్య ప్రజలు రాజకీయాలపై మాత్రమే దృష్టి పెట్టాలని, సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో ఏకాగ్రత కలిగి ఉండాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. రాజకీయ సమస్యల పరిష్కారమే తాము పెట్టుకున్న ప్రధాన అజెండా అని TVK స్పష్టం చేసింది.
ఆయితే, ఈ అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, విజయ్ తన వ్యక్తిగత జీవితంపై ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఆయన మౌనంగా ఉన్నప్పటికీ, పార్టీ 2026 ఎన్నికల పోరాటం మరియు ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టి స్పష్టత ఇచ్చింది. ఈ ప్రకటనతో పార్టీ కార్యకర్తలకు ఒక స్థిరమైన దిశనిర్దేశం లభించింది. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ విజయం సాధించగలదా, ఈ అనవసర చర్చలు ప్రభావితం చేస్తాయా, చూడాలి.
Recent Random Post:
















