విజయ్‌ 69, ‘నాలయ తీర్పు’ టైటిల్‌తో కొత్త సినిమా!


తమిళ సూపర్‌స్టార్ విజయ్‌ తాజా సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్‌ మరింతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా, అధికారికంగా ప్రకటించకపోయినా, తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘భగవంత్‌ కేసరి’ రీమేక్‌గా ఉంటుందని సమాచారం. దర్శకుడు అనిల్‌ రావిపూడితో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

ఇటీవల తమిళ పరిశ్రమలో ఒక నటుడు దీనిపై వివరణ ఇచ్చాడు, దాంతో విజయ్‌ సినిమా ‘భగవంత్‌ కేసరి’ రీమేక్‌గా కన్ఫర్మ్‌ అయింది. తమిళ ప్రేక్షకుల కోసం ఈ సినిమా కథను స్క్రీన్‌ప్లే మార్పులు చేయబడిందని అంటున్నారు. విజయ్‌ 69వ సినిమాకు ఇప్పటికీ టైటిల్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, దసరా కానుకగా ‘నాలయ తీర్పు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ టైటిల్‌కు వెనుక భావన కూడా ఉంది. విజయ్‌ నటుడిగా పరిచయం అయిన తొలి సినిమా కూడా ‘నాలయ తీర్పు’. తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో 18 ఏళ్ల వయసులో నటుడిగా పరిచయం అయిన విజయ్‌కు ఈ సినిమా చాలా ముఖ్యమైనది. అలా తొలి సినిమా టైటిల్‌తోనే చివరి సినిమాను తీసుకురావడం, ఫ్యాన్స్‌కి మరింత దగ్గరయ్యే అవకాశం కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల పోషించిన పాత్రను మమితా బైజు మలయాళంలో పోషిస్తారు. ఈ సినిమా విజయ్‌కు ఏ విధంగా ఫలితాలు అందిస్తుందో చూడాలి.


Recent Random Post: