విశాల్ కామెంట్స్: రివ్యూస్‌కి మూడు రోజుల గ్యాప్ ఉండాలి

Share


సినిమా ఫలితాలు రివ్యూలపై ఆధారపడి ఉంటున్నాయన్న విషయం చాలాకాలంగా చర్చలోనే ఉంది. అయితే తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ ఈsame విషయంపై స్పందించారు. ఇటీవల ‘రెడ్ ఫ్లవర్’ సినిమా ఈవెంట్‌కు అతిథిగా హాజరైన విశాల్, సినిమా రిలీజ్ రోజే రివ్యూస్, యూట్యూబ్ లైవ్స్, పబ్లిక్ రియాక్షన్స్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీకి నష్టం జరుగుతోందని చెప్పారు.

విశాల్ మాటల్లో,

“సినిమా రిలీజైన వెంటనే రివ్యూస్ ఇవ్వడం వల్ల సినిమాను చూడాలని ఉద్దేశించిన వారు కూడా వెనకడుగు వేస్తున్నారు. కనీసం మూడు రోజులు, అంటే 12 షోలు పూర్తయ్యే వరకు రివ్యూస్, పబ్లిక్ టాక్‌ని ఆపితే సినిమాకి లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో సహకరించాలి.” అని సూచించారు.

అంతేకాక, తన పెళ్లి గురించి కూడా విశాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకున్నా. దాదాపు 9 ఏళ్ల కష్టానికి ఫలితం త్వరలోనే కనిపించబోతోంది. బిల్డింగ్ పనులు చివరి దశకు చేరాయి. నా పుట్టినరోజు నాటికి గుడ్ న్యూస్ చెబుతా. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను.” అని చెప్పారు.
ఇప్పటికే విశాల్ ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఈవెంట్‌లో వీరి పెళ్లిపై సంకేతాలు కూడా ఇచ్చారు.

అయితే విశాల్ చెప్పినట్లుగా రిలీజ్ తర్వాత 3 రోజుల వరకు రివ్యూస్, పబ్లిక్ టాక్‌ని ఆపడం సాధ్యమేనా? అంటే… అది అమలులోకి రావడం కష్టమే. దీనిపై ప్రభుత్వంతో చర్చించి ఓ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ మనదేశంలో అలా నిషేధం చేసినా, విదేశాల్లో అయితే అదే సినిమాకు సంబంధించి రివ్యూస్ వచ్చేస్తాయి. అందుకే రివ్యూస్, టాక్ లీకైనంత వేగంగా ఇంటర్నెట్‌లో ప్రచారం అయ్యే రోజుల్లో ఈ పరిమితిని కొనసాగించడం కాస్తే క్లిష్టమే.


Recent Random Post: