
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు మళ్లీ భారీ హిట్ కొడతాడనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే విడుదలైన టీజర్ మాత్రం ఆ అంచనాలపై నీళ్ళు చల్లినట్టైంది. టీజర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా, సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా మేకర్స్ వీఎఫ్ఎక్స్ పనులను కొత్త టీంకు అప్పగించడంతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండగా చిరు ఖాళీగా ఉండకుండా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారు. ఇక తాజాగా విశ్వంభర వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా సాఫీగా కొనసాగుతుండటంతో మిగిలిన పెండింగ్ షూట్‌ను కూడా పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈ క్రమంలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్‌తో ఒక స్పెషల్ సాంగ్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరించారు. జూలై 31తో విశ్వంభరకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయిందని సమాచారం.
ఈ సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Recent Random Post:














