విశ్వక్ సేన్ కెరీర్‌కు కీలకంగా మారిన అనుదీప్ ‘ఫంకీ’

Share


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీ ఫంకీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ డ్రాగన్ హీరోయిన్ కయదు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫంకీ టీజర్‌తోనే అనుదీప్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ ఫన్, ఫీల్ గుడ్ టోన్‌తో సినిమా తీసుకొస్తున్నాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌కు చాలా కీలకంగా మారింది.

గత ఏడాది విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ అంటూ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ హైప్ ఉన్నప్పటికీ ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంతవరకు బెటర్‌గా అనిపించినా, మిగతా రెండు సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన లైలా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో విశ్వక్ సేన్‌పై ప్రెషర్ మరింత పెరిగింది.

అలాంటి పరిస్థితుల్లో వస్తున్న ఫంకీపై మాత్రం మంచి బజ్ ఉంది. అనుదీప్ స్టైల్ కామెడీ, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతున్నాయని టాక్. యంగ్ హీరోల్లో మంచి పొటెన్షియల్ ఉన్నప్పటికీ, తన సమకాలీనులు 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుంటే విశ్వక్ సేన్ మాత్రం వరుస ఫెయిల్యూర్స్‌తో రేసులో కాస్త వెనకబడ్డాడు. అందుకే ఫంకీ అతని కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టే సినిమాగా మారాల్సిన అవసరం ఉంది.

విశ్వక్ సేన్ – కయదు లోహర్ జోడీ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. విశ్వక్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. అందులోనూ అనుదీప్‌తో చేస్తున్న సినిమా కావడంతో మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌పై అంచనాలు పెరిగాయి. అనుదీప్ కెవి జాతిరత్నాలుతో సెన్సేషనల్ హిట్ కొట్టగా, శివ కార్తికేయన్‌తో చేసిన ప్రిన్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో చేస్తున్న ఫంకీ మాత్రం హైప్ పరంగా బలంగా ఉంది.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు. వరుస నిరాశల తర్వాత విశ్వక్ సేన్ కోరుకుంటున్న సూపర్ హిట్ ఫంకీ అవుతుందా? మాస్ కా దాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయం ఈ సినిమాతో వస్తుందా? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Recent Random Post: