వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ దసరాకి షిఫ్ట్ అవుతుందా?

Share


విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత, ఆ సినిమాకు తగిన రేంజ్‌లోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశాడు. ఈసారి వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. హారి హాసిని ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశాడు. ఆ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే జోడీ ఈసారి డైరెక్టర్–హీరోగా కలవడం సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

ఆదర్శ కుటుంబం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తొలుత ఈ సినిమాను 2026 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నా, తాజా టాక్ ప్రకారం సమ్మర్ కన్నా దసరా ఫెస్టివల్ సీజన్‌కు రిలీజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చే దసరా సీజన్ ఈ సినిమాకు మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

2026 సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ ప్లానింగ్ కూడా ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే జనవరిలో రాజా సాబ్తో ప్రభాస్ వస్తున్నాడు కాబట్టి, ఫౌజీని డిసెంబర్ లేదా అంతకన్నా ముందు ఆగస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ సినిమా సమ్మర్ కన్నా దసరా సీజన్‌కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడిగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. హిట్ 3, తెలుసు కదా వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధికి, త్రివిక్రమ్ సినిమాతో మరింత క్రేజ్ పెరగనుందని అంచనా.

ఇక ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత వెంకటేష్ ఓ యువ హీరోతో కలిసి మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వెంకటేష్–త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి ఆదర్శ కుటుంబంను సంక్రాంతికి వస్తున్నాం కంటే పెద్ద హిట్‌గా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

త్రివిక్రమ్ విషయానికి వస్తే, వెంకటేష్ సినిమా పూర్తయ్యాక తన డ్రీమ్ మైథాలజీ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడట. అయితే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాలనుకున్న మైథాలజీ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కారణం – ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తుండటం, అలాగే కొరటాల శివతో దేవర 2 ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేకపోవడమే.


Recent Random Post: