
విక్టరీ వెంకటేష్ – తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలపాటు తనదైన ముద్ర వేసుకున్న స్టార్ హీరో. 75కు పైగా చిత్రాల్లో నటించి, ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న వెంకటేష్‌కు ఇప్పటికీ అదే స్థాయిలో ఆదరణ ఉంది. ‘వెంకీ సినిమా’ అంటే కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా అని ప్రేక్షకులు నమ్ముతారు. ఒకప్పుడు అందరూ థియేటర్‌కి వెళితే ఇప్పుడు టికెట్ ధరల వల్ల కొంత వెనకడుగు వేస్తున్నా, ఆయన సినిమాలంటే ఫ్యామిలీల్లో క్రేజ్ తగ్గలేదని ఎఫ్2, ఎఫ్3, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయాలు చెబుతున్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్ల గ్రాస్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాక వెంకటేష్ తను వెంటనే కొత్త సినిమా అనౌన్స్ చేస్తారన్న అంచనాలున్నా, ఆయన మాత్రం బాగా ఆలోచించి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి టైం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది డైరెక్టర్స్ ఆయనతో సినిమాకు సిద్ధంగా ఉన్నా, ఆయన ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.
గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్లతో వెంకీకి ఉన్న కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసింది – ఇది హ్యాట్రిక్ హిట్స్ రూపంలో ముద్రపడింది. ఇప్పుడు వెంకటేష్ 77వ సినిమాగా రెండు కథలు రెడీగా ఉన్నాయని, కానీ ఇంకా వాటిలో ఒకదానిపై క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం.
ఈ సంక్రాంతికి ఇప్పటికే అనిల్ – చిరంజీవి సినిమా బిజీగా ఉంది. అలాగే మరో పెద్ద సినిమాలు కూడా రేసులో ఉండొచ్చు కాబట్టి వెంకటేష్ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ ఏడాది చివర్లో వదిలే అవకాశం మాత్రం ఉందని వినిపిస్తోంది. వెంకటేష్‌తో సినిమా అంటే షూటింగ్ మూడే నెలల్లో పూర్తి చేసే చాన్స్ ఉండటంతో, నిర్మాతలు ఎప్పుడైనా రెడీగా ఉన్నారు.
ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు – “ఆలస్యం అమృతం విషం అవ్వకముందే వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టాలి!” మరి వెంకటేష్ కొత్త సినిమా ఏ డైరెక్టర్‌తో, ఏ జానర్లో వస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఒక్క ఫ్యాన్స్‌కి కాదు, టాలీవుడ్‌కి కూడా ఉందని చెప్పొచ్చు.
Recent Random Post:















