వెంకీ కుడుముల నెక్స్ట్ పై ఆసక్తి – ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో?

Share


ఛలో సినిమాతో డైరెక్టర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల తన టాలెంట్‌ను నిరూపించాడు. ఛలోతోనే రష్మికను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన, తర్వాత నితిన్, రష్మిక కాంబినేషన్‌లో భీష్మ తీసి మరో హిట్ అందుకున్నాడు. అయితే వెంకీ మూడో ప్రయత్నం అయిన రాబిన్ హుడ్ మాత్రం ఊహించని విధంగా భారీ ఫెయిల్యూర్ అయ్యింది. నితిన్‌తో మళ్లీ ఈ కాంబో హిట్టు కొడుతుందనే అంచనాలు తలకిందులయ్యాయి.

ఇక రాబిన్ హుడ్‌కి ముందు వెంకీ మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే ఫైనల్ డ్రాఫ్ట్ మెగాస్టార్‌ను ఇంప్రెస్ చేయలేకపోయింది. చిరు కొంత పాజిటివ్‌గా స్పందించినా, కథ పూర్తిగా సంతృప్తినివ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వేశారు. అప్పట్లో రాబిన్ హుడ్ హిట్ అయితే మళ్లీ మెగాస్టార్ డోర్స్ ఓపెన్ అయ్యేవి కానీ ఫ్లాప్‌తో ఆ అవకాశం పూర్తిగా చేజారిపోయింది.

ఇప్పుడు వెంకీ కుడుముల నెక్స్ట్ మూవీ ఎవరు హీరోగా చేస్తారు? అనే దానిపై ఆసక్తి పెరిగింది. ఛలో, భీష్మతో క్రేజ్ తెచ్చుకున్న ఆయనకు రాబిన్ హుడ్ ఫ్లాప్ పెద్ద ఎదురుదెబ్బే. అయినా టాలెంట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి మంచి కథతో తిరిగి వస్తే, హీరోల నుంచి ఛాన్స్ రావడం కష్టమేమీ కాదు. వెంకీ కుడుముల ప్రస్తుతం నెక్స్ట్ స్టోరీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనున్నాడట.


Recent Random Post: