వేతనాల పెంపు తక్కువ కాదు – బన్నీ వాస్ స్పందన

Share


టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికుల సమ్మెపై వివాదం ముదురుతోంది. వేతనాల్లో 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గకుండా ముందడుగు వేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిభ కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాస్ స్పందించారు.

మీడియా ప్రశ్నలకు బన్నీ వాస్ స్పందిస్తూ, “నాకు ఎవరిపట్లా పక్షపాతం లేదు. నేను న్యూట్రల్. మూడు సంవత్సరాల తర్వాత వేతనాల్లో పెంపు అవసరం అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అడుగుతున్న 30 శాతం పెంపు అనేది బాగా ఎక్కువగా ఉంది. నిర్మాతలు బ్యాలెన్స్ చేయాలనే అడుగుతున్నారు, పెంపుకు వ్యతిరేకం కాదు” అన్నారు.

అలానే, “ఇప్పుడు 30 శాతం పెంచితే, మూడేళ్ల తర్వాత అది 50 శాతంగా మారుతుంది. అప్పుడు మళ్లీ పెంచాలి అనుకోవడం లాజిక్క్ కాదని నిర్మాతలు అంటున్నారు” అని వివరించారు.

తెలుగు టెక్నీషియన్స్‌పై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ, “తెలుగు సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లింది అనే మాట వాస్తవమే. కానీ ఆ స్థాయిలో వచ్చిన సినిమాలు 10-12 మాత్రమే. ఆ సినిమాల ఆధారంగా మొత్తం ఇండస్ట్రీని అంచనా వేయడం తప్పు” అన్నారు.

“ఆ పది చిత్రాల టైమ్‌లో రెండు మూడు వందల చిన్న సినిమాలు వచ్చాయి. కేవలం ఆ పది సినిమాల వల్లే ఇండస్ట్రీ పెద్దదైపోయిందనుకోవడం పొరపాటు. ఒక చిన్న సినిమా తీయాలంటేనే 10-12 కోట్ల ఖర్చు అవుతోంది. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి” అని పేర్కొన్నారు.

చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితిపై మాట్లాడుతూ, “ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు లాభాలు ఇవ్వడం లేదు. ఒక నిర్మాత ఎప్పటికీ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాలు తీయలేడు. థియేటర్స్‌కు జనాలు రావడంలేదు. హైదరాబాద్‌లో ఓ ఇంట్లో షూట్ చేయాలంటే రోజుకు రూ. 60-70 వేల వరకు రెంటల్ అవుతోంది” అన్నారు.

తెలుగు టెక్నీషియన్స్‌ స్కిల్స్‌పై ఆయన అభిప్రాయం ఇలా ఉంది:
“మన టెక్నీషియన్స్ 100% స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు తీయాలంటే మన టెక్నీషియన్స్ ఆ స్థాయికి తగిన స్కిల్స్ కలిగి ఉండాలి. లేదంటే బయటి టెక్నీషియన్స్ తీసుకురావాల్సి వస్తుంది. అది నిర్మాతలపై భారీ బరువు” అని బన్నీ వాస్ స్పష్టం చేశారు.


Recent Random Post: