
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. కన్నడలోనే కాకుండా, తమిళంలో జైలర్ 2, తెలుగులో పెద్ధి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ అనే కన్నడ చిత్రం చుట్టూ అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది.
సప్తసాగరాలు దాటి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. జూలై 12న శివన్న పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చింది.
ఫస్ట్ లుక్‌లో శివన్న సూట్ ధరించి, చేతిలో పిస్టల్ పట్టుకుని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఆయన్ను ఈ విధంగా చూడటం అభిమానులకు పూర్తిగా కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ లుక్ చూస్తే క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని స్పష్టమవుతుంది. కొంతమంది అభిమానులు మాత్రం శివన్న ఈ విధంగా కనిపించడంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కామెంట్ల ప్రకారం, ఇది ఏఐతో తయారైన పోస్టర్ అనిపించుతోందంటూ కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇక మరోవైపు శివన్న ఇటీవల కొన్ని నెలలు ఆరోగ్య సమస్యలతో బాధపడిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ చికిత్స కారణంగా ఆయన దశాబ్దకాలం కెరీర్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. దాని ప్రభావమే ఈ ఫిజికల్ లుక్‌లో కనిపించవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయినా, ఆయన తిరిగి స్క్రీన్‌పైకి రావడం అభిమానుల ఆనందానికి కొలమానమే.
“శివన్నా స్వాగతం” అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న కన్నడ ప్రేక్షకులు, ఆయన రీ ఎంట్రీకి బ్రహ్మరథం పడుతున్నారు. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Recent Random Post:















