శివాజీ ఐబొమ్మ రవి పై వ్యాఖ్యలు వైరల్

Share


పైరసీ వెబ్‌సైట్ iBomma వ్యవహారంలో రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి అరెస్ట్‌తో పాటు iBomma, Bapama TV వంటి పలు పైరసీ వెబ్‌సైట్లు కూడా మూసివేసారు. ఈ ఘటనపై ఇప్పటికే అనేక టాలీవుడ్ ప్రముఖులు స్పందించగా, తాజాగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం శివాజీ దండోరా సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, సినిమా గురించి చెప్పిన తర్వాత iBomma రవి విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.

అతని టాలెంట్ చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్న శివాజీ—
“మొత్తానికి అతన్ని పట్టేశారు. వాడికేది కసి… ఆ టాలెంట్‌ను మంచి పనికే వాడుకోవాలి. ఆ అబ్బాయి మంచి హ్యాకర్ అని విన్నాను. దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారితే మంచిది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని అతను ప్రూవ్ చేశాడు” అని అన్నారు.

అలాగే,
“అతను చేసిన పని తప్పిదమే. దుర్మార్గం కూడా. కానీ టాలెంట్ గురించి విని షాక్ అయ్యాను. సరైన దారిలో పెడితే దేశానికి పనికొచ్చే వ్యక్తిగా మారొచ్చు. చిన్న వయసులో తెలియక, డబ్బుల లేమితో అలాంటి నిర్ణయం తీసుకుని చాలామందిని ఇబ్బంది పెట్టాడు” అని పేర్కొన్నాడు.

“మనందరికీ రాజ్యాంగం ఉంది. దానికి లోబడే జీవించాలి. అతను ఆ గీత దాటాడు. ఇకనైనా మారాలి. సినిమా థియేటర్‌ అనుభూతి ఎక్కడా దొరకదు. ప్రపంచంలోనే సినిమానే చీప్ ఎంటర్టైన్‌మెంట్” అని అన్నారు.

అంతేకాక,
“మూడు గంటల సినిమా నచ్చితే జీవితాంతం గుర్తుంటుంది. ఎన్టీఆర్‌ ‘మిస్సమ్మ’, ‘పాతాళ భైరవి’ ఇప్పటికీ మనకు గుర్తుండటమే ఉదాహరణ. మనం సినిమా చూడడానికి ఖర్చు పెట్టేది రూ.200 మాత్రమే. కానీ ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది. అందుకే థియేటర్లోనే సినిమా చూడండి. ఒకో సినిమాలో ఎంతో మంది కష్టపడతారు… పైరసీని ప్రోత్సహించొద్దు” అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు.


Recent Random Post: