
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే కొత్త నటీనటులు ప్రతి ఒక్కరికి వెనుక కథ ఉంటుంది. కొంతమంది తమ డ్రీమ్‌ను నెరవేర్చడానికి, మరికొందరు డబ్బు కోసం, మరికొందరు తల్లిదండ్రుల కోరిక మేరకు, లేదా ఫ్యాషన్ కారణంగా ఈ రంగంలోకి రాగలిగారు. ఈ క్రమంలో, శివ కార్తికేయన్ కూడా తన అసలు ఆలోచనను బయటపెట్టారు.
ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి ఈ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రముఖ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించి, అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ ఈవెంట్లో శివ కార్తికేయన్ చెప్పారు, “నేను చిన్నతనంలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలగంటూ ఉండేవాడిని. మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్, నేను ఆయనను మించి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోతే, ఖచ్చితంగా ఐపీఎస్ ట్రై చేసేవాడిని.”
ఇకపోతే కోలీవుడ్‌లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న శివ, ఇటీవల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందని తెలిపారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోగా మారిన శివ, వరుస సినిమాలతో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన విజయ్ గురించి మాట్లాడుతూ, “విజయ్ ను నేను అన్నగానే భావిస్తాను. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే, అన్నయ్య ఎప్పుడూ అన్నయ్యే” అన్నారు.
మరియు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడం తనకో గొప్ప గర్వమని శివ వెల్లడించారు.
Recent Random Post:














