శైలజ ప్రియ న్యూ లుక్: 47 ఏళ్లలోయూ యంగ్ అండ్ స్లిమ్!

Share


సినిమా ప్రేక్షకులకు శైలజ ప్రియ అంటే ప్రత్యేక పరిచయమే. అక్కగా, వదినగా, పిన్నిగా, అమ్మగా ఎన్నో పాత్రల్లో ఆకట్టుకున్న ప్రియ 1997లో వెండితెరపై అడుగుపెట్టి ఆ తర్వాత సీరియల్స్, సినిమాల మధ్య బిజీగా కొనసాగుతున్నారు. నటనతోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన జీవితానికి సంబంధించిన అప్డేట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తుంటారు.

ప్రియ అందానికి, ఆమె నటనకు అభిమానులెన్నో. 47 ఏళ్ల వయసులోనూ ఎంతో యంగ్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. తాజాగా ఆమె వెకేషన్ ట్రిప్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వెంటనే వైరల్ అయ్యాయి. ఫోటోల్లో ప్రియ చాలా స్లిమ్ గా మారినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు కాస్త బొద్దుగా కనిపించిన ప్రియ, ఇప్పుడు స్లిమ్ లుక్ లో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు.

ప్రియ న్యూలుక్ చూసిన నెటిజన్లు “వయసు కేవలం సంఖ్య మాత్రమే” అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాలు, సీరియల్స్‌తో పాటు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా మరోసారి టీవీ ఆడియన్స్ ను కట్టిపడేశారు. ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


Recent Random Post: