శ్రీనిధి శెట్టి సింపుల్ లైఫ్ స్టైల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

Share


హీరోయిన్లు అంటే తెర మీదనే కాదు, తెర వెనక కూడా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించడం మనం తరచూ చూస్తుంటాం. డిజైనర్ డ్రెస్సులు, చిన్నదుస్తులు, వెకేషన్‌లో టూ పీస్‌లు, బికినీల్లో ఫోటోలు — ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ప్రతి క్షణాన్ని అభిమానులతో పంచుకుంటారు. గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ అంటే ఎప్పుడూ అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలి అనే అభిప్రాయం ఉంది. కానీ, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం ఈ దారిలో నడవడం లేదని స్పష్టం చేసింది.

కేజీఎఫ్తో పరిచయం అయిన శ్రీనిధి, ఇటీవల హిట్ 3తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్ తర్వాత తనకు అవకాశాలు రాలేదనే ప్రచారాన్ని ఆమె ఖండించింది. వచ్చిన పాత్రల్లో నచ్చినవే ఎంచుకున్నానని, మిగతావి తనే వదులుకున్నానని తెలిపింది.

తాను హీరోయిన్ అయినా కూడా సాధారణ జీవనశైలినే ఇష్టపడతానని చెబుతోంది శ్రీనిధి. బయటకు వెళ్ళాలంటే ప్రత్యేక కారు అవసరం లేదని, సింపుల్‌గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానని, ఇంటి సరుకులన్నీ తానే కొని తెచ్చుకుంటానని, రోడ్డుపక్కన పానీపూరీ కూడా తినేస్తానని candid‌గా చెప్పింది. హీరోయిన్ అంటే తప్పనిసరిగా ఫ్యాన్సీ లైఫ్‌స్టైల్ అనేది తనకు నచ్చదని స్పష్టం చేసింది.

పెరిగిన వాతావరణమే తనను ఇలావు మార్చిందని ఆమె అంటోంది. ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెల్లు, పదో తరగతి చదువుతుండగానే తల్లి చనిపోవడం, తండ్రి కష్టాలు చూసిన అనుభవం — ఇవన్నీ తనను బలంగా నిలబెట్టాయని తెలిపింది. అందుకే నటిగా ఫేమ్ ఉన్నా కూడా సింపుల్ లైఫ్‌తో బ్యాలెన్స్‌గా ముందుకు వెళ్తున్నానని చెప్పింది శ్రీనిధి.


Recent Random Post: