
శ్రీలీల కెరీర్ ఇప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతోంది. వరుస హిట్ చిత్రాలతో ఆమె టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతూ అక్కడ తనకున్న టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తర్వాత అలాంటి ఓ గుర్తింపు శ్రీలీలకు కూడా వస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
తాజాగా ఉగాది సందర్భంగా శ్రీలీల తన కుటుంబంతో కలిసి పండుగను ఎలా జరుపుకుంటుందో తెలియజేసింది. “నాకు భక్తి చాలా ఎక్కువ. ఇంట్లో నిత్యం పూజలు చేస్తుంటాం. పండుగ రోజుల్లో మరింత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం మా కుటుంబ సంప్రదాయం. ఉగాది రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంట్లోని ప్రతి మూలకూ అందంగా ముగ్గులు వేస్తాను. ఉగాది పచ్చడిని నేను దగ్గరుండి సిద్ధం చేస్తాను. పచ్చడికి కావాల్సిన పదార్థాలను ముందురోజే రెడీ చేసుకుంటాను,” అని చెప్పింది.
తన ఆధ్యాత్మిక దృక్పథాన్ని పంచుకుంటూ శ్రీలీల ఇలా చెప్పింది: “లోక సమస్తా సుఖినో భవంతు అనే సూక్తిని గట్టిగా నమ్ముతాను. అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తాను. భగవద్గీతలో చెప్పినట్లు, పని మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం కాదు. ఆ సిద్ధాంతాన్ని నేను జీవితంలో అనుసరిస్తాను.”
తెలుగు కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా ఉగాది వంటి పండుగలకు శ్రీలీల ఇచ్చే ప్రాముఖ్యత అర్థమవుతోంది. సంక్రాంతి సమయంలో కూడా తన పండుగ సెలబ్రేషన్స్ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్‌గా చదువుకున్నా, స్టార్ హీరోయిన్ అయినా శ్రీలీలలో ఉన్న అనౌకార్యమైన తత్వం ఆమెను అభిమానులకు మరింత దగ్గర చేస్తోంది.
Recent Random Post:














