
తెలుగు అమ్మాయి శ్రీలీల ట్యాలెంట్ పరంగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరాల్సిన స్థితిలో ఉంది. కానీ నటిగా ఆమెకు దక్కాల్సిన పూర్తి స్థాయి గుర్తింపు మాత్రం ఇంకా రావాల్సిందే అన్నది నిజం. చెప్పుకోవడానికి ఇప్పటికే 17 సినిమాలు చేసిన నటే అయినప్పటికీ, పేరు–పాపులారిటీ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీలీల, కన్నడలో ‘కిస్’ సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ అయింది. ఆ తర్వాత ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమె నటన, డాన్స్ స్కిల్స్ బయటపడ్డాయి. ముఖ్యంగా మంచి డాన్సర్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో విశ్లేషకులు కూడా శ్రీలీలకు నటిగా మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఇంత ప్రతిభావంతమైన హీరోయిన్ రావడం అరుదనే ఇమేజ్ కూడా ఆమెపై ఏర్పడింది.
అయితే టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలను గమనిస్తే, నిజంగా గుర్తింపు తెచ్చిన పాత్రలు మాత్రం మూడు లేదా నాలుగు సినిమాలకే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీల చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది కానీ, మొత్తంగా కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించినంత ఎగబాకలేదు.
ఇప్పటికే తెలుగులో ఎనిమిది–తొమ్మిది సినిమాలు చేసినప్పటికీ, వాటి ద్వారా శ్రీలీల సాధించింది ఏమిటన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఈ విషయాన్ని శ్రీలీల కూడా ఇప్పుడు గ్రహిస్తున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎక్కడ తప్పు జరుగుతోందో ఆమె అర్థం చేసుకుని, ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఫిక్స్ అయిందట.
ఈ క్రమంలోనే తెలుగుకే పరిమితం కాకుండా హిందీ సహా ఇతర భాషలపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్‌లో కంటిన్యూ అయితే పూర్తి స్థాయిలో ఐటమ్ సాంగ్స్ లేదా గ్లామర్ పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుందనే భావన ఆమెకు కలిగిందని టాక్. గ్లామర్ బ్యూటీగా మాత్రమే గుర్తుండిపోవడం కంటే, నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఆమె కోరుకుంటోంది.
అందుకే కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చినా సరే, మంచి పాత్రలు మాత్రమే చేయాలి అనే నిర్ణయానికి వచ్చింది. ఈ కారణంగా తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను కూడా తిరస్కరించినట్టు సమాచారం. తాజాగా శ్రీలీల అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ, మంచి సినిమాలు మాత్రమే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Recent Random Post:















