శ్రుతిహాస‌న్ ఈసారి అంతా సీక్రెట్ గానే!

శ్ర‌తిహాస‌న్ ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ఎవ‌రో తెలిసిందే. అత‌డే ఇట‌లీ మ్యూజిష‌న్ మైఖెల్ కోర్స‌లే. ఇత‌గాడితో శ్రుతిహాస‌న్ ఏ రేంజ్ లో మునిగి తేలిందో తెలిసిందే. తొలి ప‌రిచ‌యం ..అది స్నేహంగా మార‌డం..అటుపై ప్రేమ పుట్ట‌డం…ఆ వ్య‌వ‌హ‌రంతా తండ్రి క‌మ‌ల్ హాస‌న్ దృష్టికి వెళ్ల‌డం… పెళ్లి ప్ర‌పోజ‌ల్ ..క‌లిసి అంతా పార్టీలు ఏంజాయ్ చేయ‌డం..క‌లిసి డిన్న‌ర్ లు చేయ‌డం ఇలా చాలా తంత‌గ‌మే జ‌రిగింది.

ఇక మెడ‌లో మూడు మూళ్లు వేడ‌యం..ఏడు అడుగులు న‌డ‌వ‌డ‌మే ఆల‌స్యం అనుకున్నారు? అత‌గాడితో ప్రేమ‌లో ఉన్న స‌మ‌యంలో సినిమాలు సైతం స‌రిగ్గా చేయ‌ని సంగ‌తి తెలిసిందే. అతంగా మైఖెల్ ప్రేమలో మునిగి తేలింది. ఇంత‌లోనే ఆబంధం వీగిపోయిందంటూ అభిమానుల గుండె ప‌గిలే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ బంధం ఎందుకు వీగిపోయింద‌న్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఈ మ‌నోవేద‌న‌తో శ్రుతిహాసన్ కొన్నాళ్లు సోష‌ల్ మీడియాకి దూర‌మైంది.

hతిరిగి కెరీర్ పై ఫోక‌స్ చేసేందుకు మాన‌సికంగానూ మ‌ళ్లీ దృడ‌ప‌డింది. ఈ అనుభ‌వంతో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌ద‌నుకున్నారంతా? కానీ మైఖెల్ దూర‌మైన కొన్న‌ళ్ల‌కే డూడుల్ ఆర్టిస్ట్ శంత‌న‌పు హ‌జారికాకు ద‌గ్గ‌రైంది. అయితే ఇత‌ని విష‌యంలో మాత్రం శ్రుతి మొద‌టి నుంచి జాగ్ర‌త్త‌గానే ఉంటుంది. మీడియాకి చిక్క‌కుండా చూసుకుంటుంది. అవ‌స‌ర‌మైతే త‌ప్ప అన్ని సంద‌ర్భాల్లోనూ మీడియా మందుకు తీసుకురావ‌డం లేదు.

వ్య‌క్తిగ‌త ఫోటోలు షేర్ చేయ‌డం వంటికి కూడా పెద్ద‌గా చోటు చేసుకోవ‌డం లేదు. ఏం చేసినా అన్నింటిని ర‌హ‌స్యంగా దాచేస్తుంది. తొలి ప్రేమ వైఫ‌ల్యంతో ఎదుర్కున్న చేదు అనుభ‌వాలు మ‌ళ్లీ రిటీప్ కాకుండా చూసుకుంటుంది. వృత్తి ప‌ర‌మైన కెరీర్ ప‌రంగానూ అంతే జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. శంత‌ను తోడు ఉన్నాడ క‌దా? అని సినిమాలు లైట్ తీసుకోలేదు. వృత్తి..వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్తుంది. మ‌రి శంత‌ను హ‌జారికా గురించి క‌మ‌ల్ హాస‌న్ కి తెలిసో ? లేదో? తెలియాలి సుమీ.


Recent Random Post: