
ప్రముఖ బిజినెస్‌మ్యాన్, సినీ నిర్మాత, నటుడు అయిన సంజయ్ కపూర్ (53) అనూహ్యంగా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. పోలో ఆడుతుండగా తేనెటీగ అనుకోకుండా నోట్లోకి వెళ్లి, గొంతులో కుట్టిన వేళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఏర్పడింది. ఈ అలెర్జీ కారణంగా గుండె నొప్పి వచ్చి ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు.
సంజయ్, సీనియర్ నటి కరిష్మా కపూర్‌కు మాజీ భర్త. వీరి విడాకుల తర్వాత కూడా వ్యక్తిగతంగా సత్సంబంధాలు కొనసాగినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం తన మూడో భార్య ప్రియా సచ్దేవ్తో సహజీవనం చేస్తున్నారు. సంజయ్‌కు, ప్రియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే కరిష్మాకు కూడా ఇద్దరు సంతానమున్నారు.
సంజయ్ మరణం జరిగిన సమయంలో లండన్‌లో ఉన్నారు. ఆయన అమెరికా పౌరుడైన నేపథ్యంలో మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో కొన్ని చట్టపరమైన ప్రక్రియల వల్ల ఆలస్యం ఏర్పడింది. డాక్యుమెంటేషన్, ప్రభుత్వ అనుమతుల కారణంగా అంత్యక్రియలు కొంత ఆలస్యం అయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం, సంజయ్ కపూర్ అంత్యక్రియలు జూన్ 19, గురువారం న్యూఢిల్లీ లోధి రోడ్ శ్మశాన వాటికలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. అంతేకాక, జూన్ 22న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సంతాప సభ నిర్వహించనున్నారు.
సంజయ్ కపూర్ భారతదేశంలోని ప్రముఖ ఆటో కాంపొనెంట్ కంపెనీ సోనా కామ్‌స్టార్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తూ, దాదాపు ₹10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అంతేకాకుండా, పోలో ఆటపై ఆయనకు తీవ్ర ఆసక్తి ఉండేది. ఆటలో భాగంగా మైదానంలో గట్టి శ్రమ పెట్టేవారు. అనుకోకుండా జరిగిన ఈ విషాదకర ఘటన పలువురిని తీవ్ర విషాదంలో ముంచేసింది.
Recent Random Post:














