సందీప్ రెడ్డి వంగా–ప్రభాస్ మూవీ “స్పిరిట్”: చిరంజీవి రూమర్ ఫేక్, డాన్ లీ రహస్యం

Share


టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల, ఈ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ విడుదల చేసి, భారీ బజ్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా. “స్పిరిట్” టీజర్ కేవలం టాలీవుడ్ లోనే కాక, బాలీవుడ్ లో కూడా మంచి హైప్ ను పొందగలిగింది.

స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా రాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ నెట్లో వినిపిస్తోంది. అందులో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారని, ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి, ఇది హైప్ ని మరింత పెంచింది.

కానీ, రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా స్పష్టత ఇచ్చారు. స్పిరిట్ మూవీలో చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో లేదని, అసలు ఆయన ఏ పాత్రలోనూ కనిపించబోవని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అన్ని వార్తలు పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆయన చిరంజీవితో కలసి మరొక సినిమాను చేయాలనుకుంటున్నారని కూడా తెలిపారు.

అదే సందర్భంలో, సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ క్యారెక్టర్ చేస్తాడా అని అడగగా, సందీప్ పూర్తిగా సమాధానం చెప్పలేదు. డాన్ లీ స్పిరిట్ లో భాగమని, అందుకే ఆ వార్తలను తిరస్కరించలేదని భావిస్తున్నారు.

టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పిరిట్ సినిమాను ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారు.

యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్పిరిట్ సినిమా 60% బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని సందీప్ వెల్లడించారు.


Recent Random Post: