యానిమల్, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది రష్మిక మందన్న. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియాలో గ్రాండ్ సక్సెసయ్యాయి. వరుస విజయాల్ని ఆస్వాధిస్తున్న రష్మిక తాజా ఇంటర్వ్యూలో తన దర్శకులను ఆకాశానికెత్తేసింది. యానిమల్, పుష్ప దర్శకులు సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లకు స్త్రీలంటే ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయని రష్మిక కితాబిచ్చింది. స్త్రీల పాత్రలను నిస్సహాయులుగా చూపించరని, వారిని శక్తివంతమైన వారిగా తెరపై ఆవిష్కరిస్తారని రష్మిక మందన్న ప్రశంసించారు.
పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన రష్మిక `యానిమల్` చిత్రంలో గీతాంజలి పాత్రలోను తనదైన అద్భుత నటనతో మెప్పించారు. తాను స్త్రీ సాధికారత ఉన్న పాత్రల్లో నటించానని, అలాంటి దర్శకులతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నానని రష్మిక అన్నారు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా .. సుకుమార్ ఇద్దరూ తమ చిత్రాలలో మహిళలను బలమైన, సాధికారత కలిగిన వ్యక్తులుగా ఎలా చిత్రీకరించారో రష్మిక వివరించారు. ఆ ఇద్దరు దర్శకులు మహిళలను నిస్సహాయులుగా చూడరని, శక్తివంతమైన వ్యక్తులుగా చూస్తారని కూడా అన్నారు. ఈ దృక్పథం గీతాంజలి, శ్రీవల్లి పాత్రలలో ప్రతిబింబిస్తుంది. రణవిజయ్ లేదా పుష్ప వంటి మగవాళ్ళ నుండి ప్రమాదం పొంచి ఉన్నా కానీ.. వారుతప్పులు చేసినప్పుడు వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఉండే మహిళలను తెరపై చూస్తారు అని అన్నారు.
మహిళలపై సందీప్ వంగా – సుకుమార్‌లకు ఉన్న గౌరవమే తమ సినిమాలలో బలం అని కూడా వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్, రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ లాంటి సహనటులు తనకు కెరీర్ పరంగా వెన్నుదన్నుగా ఉంటారని తనకు ఎప్పుడైనా సపోర్ట్ అవసరమైతే వారి సలహాలు సూచనలు తీసుకుంటానని రష్మిక తెలిపింది. రష్మిక తదుపరి పుష్ప 3లో కనిపించనుంది. విక్కీ కౌశల్ హిస్టారికల్ మూవీ `చావా`లోను రష్మిక కథానాయికగా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
Recent Random Post: