సన్నీ డియోల్ అఖండ 2లో గెస్ట్ రోల్: అభిమానుల‌కు కొత్త సర్ప్రైజ్!

Share


తాజాగా, నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 – తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా చేసిన ప్రభంజనం తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. బాలకృష్ణ మాస్ యాటిట్యూడ్, బోయపాటి మాస్ ట్రీట్‌మెంట్ కలిసికూడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా, అఖండ 3 గురించి ఆసక్తికరమైన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అఖండ 2 పూర్తయ్యాక, అఖండ 3 ప్రీ-ప్లానింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ విలన్ క్యారెక్టర్లు ఫిక్స్ చేయాలని బోయపాటి టీమ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అఖండ 2లో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక అఖండ 3 కోసం సన్నీ డియోల్ పేరు బాగా వినిపిస్తోంది.

తాజాగా, అఖండ 2 సినిమా కోసం జార్జియాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించే దిశగా ప్లానింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కూడా పాల్గొనబోతున్నారట. అయితే, సన్నీ డియోల్ ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే, పూర్తి విలన్ పాత్ర కాకుండా, ఒక కీలకమైన చిన్న పాత్రలో, పటాసు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, సన్నీ డియోల్ గెస్ట్ రోల్ అఖండ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వగలదని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, సన్నీ డియోల్ అఖండ యూనివర్స్‌లో ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని రేపుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం జాట్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బాగా స్పందన పొందుతున్నారు, 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా విజయంతో ఆయన కెరీర్‌లో మరింత జోష్ వచ్చిందనే చెప్పవచ్చు.

మొత్తానికి, అఖండ 2లో సన్నీ డియోల్ గెస్ట్ రోల్ సినిమా కోసం అదనపు మసాలా జోడిస్తుందనే ఆశా ప్రేక్షకుల్లో ఉంది. బాలకృష్ణ పవర్, బోయపాటి మాస్ ట్రీట్‌తో సన్నీ డియోల్ సర్ప్రైజ్ అప్పియరెన్స్, ప్రేక్షకులకు పూర్తి కిక్ ఇచ్చేలా ఉంటుంది. మరి ఈ అఫిషియల్ డిటైల్స్ ఎప్పుడు వెలువడతాయో చూడాలి.


Recent Random Post: