సమంత కమ్‌బ్యాక్ మూవీకి భారీ హైప్

Share


స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఫుల్ ఫ్లెజ్డ్ కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నారు. హెల్త్ ఇష్యూస్‌తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరమైన సామ్… ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది తన ప్రొడక్షన్ డెబ్యూ మూవీ **‘శుభం’**లో క్యామియోగా కనిపించిన సమంత, ఈసారి లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్పై నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇటీవల మా ఇంటి బంగారం నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో చీరకట్టులో రగ్డ్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించిన సమంత మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. బస్సులో నిలబడి కనిపించిన ఆ లుక్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

ఈ సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది మరో అంశం. సమంత భర్త, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ది ఫ్యామిలీ మాన్, ఫర్జీ, సిటాడెల్: హనీ బన్నీ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో తన టాలెంట్ నిరూపించుకున్న రాజ్… ఇప్పుడు తన క్రియేటివ్ టచ్‌ను ఈ సినిమాకు ఇవ్వనున్నారన్న మాట. స్టోరీ నుంచి మేకింగ్ వరకు ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

పెళ్లి తర్వాత సమంత – రాజ్ నిడిమోరు కలిసి వర్క్ చేస్తున్న తొలి సినిమా కావడం కూడా మా ఇంటి బంగారంపై ఆసక్తిని పెంచుతోంది. గతేడాది డిసెంబర్ 1న తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట… ఇప్పుడు కలిసి చేసిన సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. సమంత కమ్‌బ్యాక్ మూవీగా మా ఇంటి బంగారంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.


Recent Random Post: