స‌మంత కెరీర్ కే ఛాలెంజ్ విసిరిన రోల్!

స‌మంత కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో చిత్రాల్లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేసింది. ఎన్నో పాత్ర‌ల్లో …మ‌రెన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర స్థాయిగా స్థానం సంపాదిం చింది. అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్ల‌డానికి ముందు కోలీవుడ్, టాలీవుడ్ లో ఎంతో ఫేమ‌స్ అయిన న‌టి. అమ్మ‌డు కెరీర్ లో ఓన‌మాలు నేర్చుకుంది ఇక్క‌డే. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కూడా ఇదే ఇండ‌స్ట్రీల్లో.

ఇక్క‌డ నుంచి బాలీవుడ్ కి ప్ర‌మోట్ అయింది. ఇప్ప‌టికే అక్క‌డ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సైతం న‌టించి తానేంటో చూపించింది. త్వ‌ర‌లోనే ‘సీటాడెల్ : హ‌నీ బెన్నీ’ వెబ్ సిరీస్ తోనూ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో అమ్మ‌డు పాత్ర ఎంతో సాహ‌సోపేతంగా సాగుతుంద‌ని ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల్ని బ‌ట్టి అర్ద‌మ‌వుతుంది. ఈ సిరీస్ కోసం అమ్మ‌డు చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది.

తాజాగా ఆస్క్ మీ ఎనిథింగ్ సెష‌న్ లో కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించ‌డంతో పాటు ‘సీటాడెల్’ లో తన పాత్ర విషయంలో ఎలా ఫీల‌వుతుంద‌నే విష‌యాలు పంచుకుంది. అవేంటో ఆమె మాట‌ల్లోనే..’నేను పోషించే ప్రతి పాత్ర‌ను స‌వాల్ గానే తీసుకుంటాను. అది ఎలాంటి పాత్ర అయినా స‌రే ఈజీగా మాత్రం తీసుకోను. ప్ర‌తీ పాత్ర‌కు ఓ గుర్తింపు ఉంటుంది. అది చిన్న‌దైనా..పెద్ద‌దైనా స‌రే. నేను పోషించే పాత్ర‌తో న‌న్ను నేనెప్పుడు స‌వాల్ చేసుకుంటా.

ప్ర‌తీ స‌వాల్ చివ‌రి దాని కంటే క‌ష్టంగానే అనిపిస్తుంది. నేను గతంలో కొన్ని తప్పులు చేసాను. ఆ వైఫ‌ల్యాల్ని అంగీక రిస్తానంది. అలాగే ‘హ‌నీ బెన్ని’లో త‌న పాత్ర గురించి మాట్లాడుతూ, ‘ ఇలాంటి పాత్ర చేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. నాలో ఆత్మ విశ్వాసం పెంచిన పాత్ర ఇది. ఎన్నో భావోద్వేగాల‌తోనూ ఆ పాత్ర ముడిప‌డి ఉంటుంది. ఇది నా మొత్తం కెరీర్ లో అతి పెద్ద స‌వాల్ విసిరిన రోల్. ‘లేయర్డ్, ఛాలెంజింగ్ , కాంప్లికేటెడ్’ పాత్ర ఇది’ అన్నారు.


Recent Random Post: