
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ చిత్రంతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్ట్స్‌తో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్‌లో ఉంచుకుని బిజీగా ఉన్నారు.
ఇవే కాకుండా ప్రభాస్ చేయాల్సిన రెండు భారీ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. అవే సలార్ 2 మరియు కల్కి 2. ఈ రెండు సినిమాలపై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సలార్ 2 వర్క్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా సలార్ అద్భుతమైన కలెక్షన్లు సాధించి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అప్పుడే మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్‌గా సలార్ 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రమంలో ఇప్పుడు సలార్ 2పై అభిమానుల ఎదురుచూపులు ఫలించనున్నాయనే టాక్ వినిపిస్తోంది. జనవరి 25 లేదా 26 తేదీల్లో సలార్ 2కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ నుంచి గానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయినప్పటికీ, ఈ వార్తలు సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తున్నాయి.
ఇప్పటికే సలార్ 2 స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాంటప్పుడు ఆ సినిమా పూర్తికాకముందే సలార్ 2 ఎలా ప్రారంభమవుతుందన్న సందేహాలు కూడా కొందరిలో వ్యక్తమవుతున్నాయి.
మరికొందరైతే ముందుగా సలార్ 2ను అధికారికంగా అనౌన్స్ చేసి బజ్ క్రియేట్ చేసి, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
Recent Random Post:















