
ఇప్పుడు టాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల సినిమాలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా బలమైన ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు — ప్రభాస్ “సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్” మరియు ఎన్టీఆర్ “దేవర: పార్ట్ 1” — రెండూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.
ప్రస్తుతం ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరింది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, “సలార్ 2” మరియు “దేవర 2” మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోరు జరగనుంది.
ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా “ఫౌజీ”లో నటిస్తున్నాడు. తరువాత “కన్నప్ప”, “ది రాజా సాబ్” పూర్తి చేసి, “సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం” సెట్స్‌పైకి తీసుకురానున్నారు. “సలార్ 1”లో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే సినిమా ముగిసింది. ఈ ప్రశ్నలన్నింటికీ “సలార్ 2”లో సమాధానం లభించనుంది. ప్రీత్వీరాజ్ సుకుమారన్ ఎలా విలన్‌గా మారాడు? ప్రభాస్ పాత్రకు మాస్ మేకోవర్ ఎలా ఉండబోతుంది? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదే విధంగా ఎన్టీఆర్ నటించిన “దేవర” సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. తనయుడు వరద, దేవరను ఎందుకు చంపాడు? వాస్తవంగా ఆయన మరణించాడు? అనే ప్రశ్నల పరిష్కారమే “దేవర 2” కథకు మెయిన్ పాయింట్ అవుతుంది. ఇందులో సైఫ్ అలీఖాన్‌తో పాటు “యానిమల్” విలన్ బాబీ డియోల్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. అదనంగా రమ్యకృష్ణ పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనుండగా, రణ్‌బీర్ కపూర్ లేదా రణ్‌వీర్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్.
ఈ నేపథ్యంలో “సలార్ 2” vs “దేవర 2” పోరాటం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తారాస్థాయిని చేరే అవకాశముంది. ప్రత్యేకతలతో రానున్న ఈ రెండు సీక్వెల్స్ సినీప్రియులందరినీ థియేటర్లవైపు లాకట్టే అవకాశం ఉంది.
Recent Random Post:














