సల్మాన్ ఖాన్ నిద్ర పై ఆసక్తికర వివరణ!

Share


సల్మాన్ ఖాన్ నిద్ర గురించి షాకింగ్ రివిలేషన్ చేశాడు. జైలులో ఉన్నప్పుడు రోజుకు 8 గంటలు నిద్రపోయిన సల్మాన్, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతాడట! బాలీవుడ్ సూపర్ స్టార్ తన నిద్రపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తన సోదరుడు అర్బాజ్ ఖాన్ – మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్ నిర్వహిస్తున్న ‘డంబ్ బిర్యానీ’ పాడ్‌కాస్ట్‌లో సల్మాన్ మాట్లాడుతూ, ‘‘నిజానికి నాకు ఎక్కువ నిద్రపడదు. నెలకోసారి మాత్రమే రోజుకు 7-8 గంటలు నిద్రపోగలను. ఇక ఎలాంటి పనిలేనప్పుడు మాత్రమే నేను బాగా నిద్రపోతాను. అందుకే జైలులో ఉన్నప్పుడు సరిగ్గా నిద్రపోయాను. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చాలా హాయిగా నిద్రపోతాను. ఎందుకంటే ఆ సమయంలో నేను ఏమీ చేయలేను కదా!’’ అంటూ తన స్టైల్‌లో సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇక యువతకు ఓ ముఖ్యమైన సందేశం ఇస్తూ “మీ వైఫల్యాలకు మీరే బాధ్యత వహించాలి. కానీ విజయం ఎప్పుడూ మీది కాదు. దాన్ని మీ తలకెక్కించుకుంటే గందరగోళంలో పడతారు!” అని సల్మాన్ సలహా ఇచ్చాడు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన అందుకుంది. అలాగే త్వరలోనే షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘టైగర్ వర్సెస్ పఠాన్’ లో నటించనున్నాడు.


Recent Random Post: