సాయిపల్లవి అలియాస్ హైబ్రిడ్ పిల్లలో ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. అమ్మడు ఇండస్ట్రీకి కొన్ని నియమ నిబంధనలతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా కమిట్ అవ్వాలంటే? తన పాత్రకు ప్రత్యేకమై ఐడెంటీటీ ఉండాలి. రిలీజ్ తర్వాత ఆ పాత్ర గురించి చెప్పుకోవాలి. మేకర్ ఆ విధంగా స్క్రిప్ట్ లో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఇస్తేనే లాక్ అవుతుంది. లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఇక గ్లామర్ పాత్రలైతే దరిదాపుల్లో కూడా రానివ్వదు. ఎన్ని కోట్లు పారితోషికం ఆఫర్ చేసినా నో వే అనేస్తుంది.
తాను గీసుకున్న గీతకి లోబడే అన్ని ఉండాలంటుంది. గీతని ససేమీరా దాటనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఆరకంగా అవకాశాల పరంగా మిగతా నాయికలతో పొల్చుకుంటే వెనుకబడి ఉందనే విమర్శ ఉంది. తనలో ఆ క్వాలీటీనే అమ్మడి మైలేజ్ ని పెంచుతుందన్నది కొందరి మాట. ఆ రకంగా ఇప్పటివ రకూ పల్లవి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. ఆమె చివరి సారిగా గతేడాది `విరాటపర్వం`లో నటించింది. అప్పటి నుంచి కొత్త సినిమా కబురు లేదు.
మరి ఈ గ్యాప్ ఎందుకు వస్తోంది? తాను కావాలని తీసుకుంటుందా? లేక మనసుకు నచ్చిన పాత్రలు లేక ఖాళీగా ఉంటుందా? అంటే ఈ రెండు ప్రధాన కారణాలుగానే విశ్లేషించాలి. `ఫిదా` తర్వాత వరుసగా ఆరేడు సినిమాలు చేసింది. వాటన్నింటిలోనూ అమ్మడి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ అంటే కేవలం నాలుగు పాటలు..సీన్లకు పరిమితం కాకుండా హీరోకి ధీటుగానే ఆమె పాత్రలు గత చిత్రాల్లో హైలైట్ అయ్యాయి.
వాటిలో కొన్ని సినిమాలు ఫైయిలైనా నటిగా మాత్రం పాస్ అయింది. తొమ్మిదేళ్ల కెరీర్ లో నటిగా ఫైయిలైందని విమర్శలెప్పుడు ఎదుర్కోలేదు. దీన్ని బట్టి సాయిపల్లవి ఎంత సెలక్టివ్ గా ఉంటుందో అర్ధమవుతుంది. అయితే టాలీవుడ్ కమర్శియల్ పంథాలో చూస్తే అలాంటి నటిని మెప్పించే పాత్రలు చాలా అరుదుగానే పుడతాయి. దాదాపు మేకర్స్ అంతా హీరో ఇమేజ్ ని బేస్ చేసుకునే కథలు రాస్తారు తప్ప హీరోల ఆధారంగా రాయరు. ఆ రకంగా సాయి పల్లవికి నచ్చే పాత్రలు రాకపోయి ఉండొచ్చు.
Recent Random Post: