
టాలీవుడ్‌లో మల్టీటాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి, నటుడిగానే కాకుండా హోస్ట్, నిర్మాత, ప్రెజెంటర్‌గా కూడా విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా కొత్త సినిమా వచ్చి కొంత కాలం అవుతున్నప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం దూరంగా లేడు. ఈ గ్యాప్‌లో పలు సినిమాలకు సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇటీవల ప్రైమ్ వీడియోలో “ది రానా దగ్గుబాటి” అనే టాక్ షోను ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు రానా నటించబోయే కొత్త సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్న సిద్దూ జొన్నలగడ్డ, రానాకు ఓ ప్రత్యేకమైన కండిషన్ పెట్టాడట!
ఈ విషయాన్ని స్వయంగా రానానే వెల్లడించాడు. కోవిడ్ టైమ్‌లో సిద్దూ హీరోగా నటించిన “కృష్ణ అండ్ హిజ్ లీలా” సినిమా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. అయితే, ఈ సినిమా మొదటిసారి థియేటర్లలో విడుదల కాకపోవడంతో, సిద్దూ రానాకు ఓ షరతు పెట్టాడు. “ముందుగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తేనే నీ సినిమాకు ఓకే చెప్తా!” అని చెప్పినట్టు రానా వెల్లడించాడు.
దీంతో, ఈ సినిమా ఇప్పుడు “ఇట్’స్ కంప్లికేటెడ్” అనే కొత్త టైటిల్‌తో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని రానా, సిద్దూ, దర్శకుడు రవికాంత్ పేరేపు కలిసి ప్రమోట్ చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైనప్పుడు థియేటర్లలో చూడాలని అనుకున్న ప్రేక్షకుల కోరికను తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్దూ తెలిపారు. ఈ రీరిలీజ్ ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన తెచ్చుకుంటుందో చూడాలి!
Recent Random Post:















