సినిమా చిన్నదే కానీ.. గట్స్ మాత్రం కాస్త ఎక్కువే..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ”స్వాతి ముత్యం”. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని దసరా సందర్భంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

‘స్వాతిముత్యం’ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. దీనికి తగ్గట్టుగానే దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే అదే రోజున ‘గాడ్ ఫాదర్’ మరియు ‘ది ఘోస్ట్’ వంటి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతుంటే.. ఒక చిన్న సినిమాని ఏ ధైర్యంతో విడుదల చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు.

మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున లాంటి ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బెల్లంకొండ గణేష్ వంటి డెబ్యూ హీరోని బరిలో దింపుతూ రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్స్ వచ్చాయి. అయితే కంటెంట్ మీద నమ్మకంతోనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

సినిమా చిన్నదే అయినా.. గట్స్ మాత్రం ఎక్కువే అని ‘స్వాతిముత్యం’ నిరూపిస్తోంది. ప్రేక్షకులు ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని మార్నింగ్ షోకి.. ‘ఘోస్ట్’ ను మ్యాట్నీకి చూసి.. ఆ తర్వాత తమ సినిమాని చూస్తారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు తన స్ట్రాటజీ మార్చి.. మరో డేరింగ్ స్టెప్ వేయబోతున్నారు. రిలీజ్ ముందే ‘స్వాతిముత్యం’ స్పెషల్ ప్రీమియర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. దసరా ముందు రోజు (అక్టోబర్ 4) రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

రెండు పెద్ద సినిమాలు బరిలో నిలిచిన నేపథ్యంలో ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ వేయాలనేది మంచి స్ట్రాటజీ అనే చెప్పాలి. సినిమాకి టాక్ బాగుంటే.. జనాల దృష్టిని ఆకర్షించి ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకోడానికి అవకాశం కలుగుతుంది.

ఏదేమైనా రిలీజ్ ముందే సినిమాని ప్రదర్శిస్తున్నారంటే ‘స్వాతిముత్యం’ మేకర్స్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. తమ సినిమా మరియు కంటెంట్ మీద ఎంత నమ్మకంగా ఉన్నారనేది ఈ విషయంతో స్పష్టం అవుతోంది.

వినోద భరితమైన కుటుంబ కథా చిత్రంగా ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేష్ వీకే – రావు రమేష్ – సుబ్బరాజు – వెన్నెల కిషోర్ – సునయన – దివ్య శ్రీపాద తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా.. సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.


Recent Random Post: