సిరివెన్నెలపై త్రివిక్రమ్ హృదయ స్పందన

Share


తెలుగు సినిమా గీత రచనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక శిఖరం లాంటి పేరు. ఆయన పాటలు భావప్రధమైనవిగా, ఆలోచనలకు ఆహ్వానం పలికేలా ఉంటాయి. ఆయ‌న గాత్రంలో కాదు కానీ కలంలో భావోద్వేగాలను పలికించిన వాడు. ఈ గొప్ప కవి పట్ల ప్రత్యేకమైన గౌరవం చూపించిన వారిలో దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన సిరివెన్నెలను గుండెల్లో ఉంచుకుని అభిమానించిన తత్వవేత్త.

కొన్నేళ్ల క్రితం త్రివిక్ర‌మ్ ఇచ్చిన ఒక ఎమోష‌న‌ల్ స్పీచ్ అప్పట్లో ఎంతో వైరల్ అయింది. చాలా మందికి అది సిరివెన్నెలపై ప్రశంసల వర్షంలా అనిపించినా, వాస్తవానికి అది ప్రశంస కాదు, ఆయనకు లభించని అవకాశాలపై ఒక ఆవేదనగా త్రివిక్ర‌మ్ చెప్పిన మాటల సమాహారం. తాజాగా నా ఉచ్ఛాసం కవనం అనే ఈటీవీ కార్యక్రమంలో త్రివిక్ర‌మ్ ఆ ప్రసంగం గురించి వివరణ ఇచ్చారు. “నిజానికి నేను ఆయనను ప్రశంసించలేదు, నా నిరాశను వ్యక్తపరచాను. నేను మాట్లాడింది నిజం, అందుకే అది ప్రజలకు క‌నెక్ట్ అయింది,” అని ఆయన అన్నారు.

త్రివిక్ర‌మ్ తెలిపినట్టు, సిరివెన్నెల గీతాలు సినిమాల స్థాయిని పెంచాయి. కానీ ఆయనను సరళమైన పదాల్లో రాయమని ఒత్తిడి చేయడం ఆయనకు శిక్షతో సమానం. సిరివెన్నెల రాజీ పడే రచయిత కాదని త్రివిక్ర‌మ్ స్పష్టం చేశారు. అంతటి ప్రతిభ ఉన్నా, అవకాశాల పరంగా ఆయన ఎదురుకున్న పరిమితుల్ని గుర్తు చేశారు.

“తెలుగు సినిమా సరిహద్దులు అతన్ని రేసులో వెనక్కి నెట్టేశాయి” అన్న త్రివిక్ర‌మ్ మాటలు సిరివెన్నెల స్థానం గురించి ఎంత గాఢమైన భావన ఉందో తెలియజేస్తున్నాయి.

త్రివిక్ర‌మ్ – సిరివెన్నెల కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో క్లాసికల్ పాటలు తెలుగు సినీ సంగీతానికి మణులు కావడం విశేషం. త్రివిక్ర‌మ్ సినిమాల్లో సంగీతాన్ని అద్భుతంగా ఎలివేట్ చేయడంలో సిరివెన్నెల పాత్ర అమోఘం.


Recent Random Post: