ఈమధ్య కాలంలో నేషనల్ వైడ్ గా భాషతో సంబంధం లేకుండా అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ట్వెల్త్ ఫెయిల్. విధు వినోద్ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా ఎంతోమందిని ఇన్ స్పైర్ చేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాలో విక్రాంత్ మస్సే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ట్వెల్త్ ఫెయిల్ ముందు కూడా విక్రాంత్ సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం అతనికి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం విక్రాంత్ ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్రాంత్ మస్సే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్వెల్త్ ఫెయిల్ గురించి కూడా ప్రస్తావించారు. ట్వెల్త్ ఫెయిల్ సినిమా సీక్వెల్ చేయండని చాలా ఫోన్స్ వస్తున్నాయని. ఒక సినిమా సక్సెస్ అవగానే సీక్వెల్ ప్రేక్షకులు కోరుతారు. ట్వెల్త్ ఫెయిల్ లాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ అడగడం సహజమే. కానీ అది టీం అందరితో కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు విక్రాంత్ మస్సే.
ప్రేక్షకులకు తనను తాను డిఫరెంట్ రోల్స్ లో ప్రొజెక్ట్ చేసుకోవాలని అనుకుంటానని చెప్పిన విక్రాంత్ ట్వెల్త్ ఫెయిల్ సీక్వెల్ కి ఏది సరైన సమయం అన్నది టీం తో కలిసి నిర్ణయిస్తామని అన్నారు. విక్రాంత్ ఆయీ హసీన్ దిల్ రుబా లో తాప్సీ నటించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 9న రిలీజ్ అవుతుంది.
బాలీవుడ్ ఆడియన్స్ ఎలాగైతే కమర్షియల్ సినిమాలను ఆదరిస్తారో అక్కడ వస్తున్న కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసే ట్వెల్త్ ఫెయిల్ లాంటి సినిమాలను బీ టౌన్ ఆడియన్స్ బాగా ప్రోత్సహిస్తారు. ఐతే ఆ సినిమాలు తీసే విధంగా తీస్తే మాత్రం ఆడియన్స్ ఇవ్వాల్సిన రిజల్ట్ దానికి అందిస్తారని చెప్పొచ్చు.
ఎంత పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ పై హడావిడి చేసినా అక్కడ వస్తున్న ట్వెల్త్ ఫెయిల్ లాంటి సినిమాలను చూసే ప్రత్యేకమైన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను తరచు రావాలని కోరుతుంటారు. విక్రాంత్ మస్సే లాంటి నటులను అక్కడ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. వారు ఇచ్చే ఈ ప్రోత్సాహాన్ని చూసే విక్రాంత్ లాంటి వారు ఇలా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.
Recent Random Post: