
ఒకప్పుడు చిన్న సినిమాలు తక్కువ గుర్తింపు పొందేవి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రం పెద్ద హైలైట్ అయ్యేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా విపరీతంగా పెరిగి, ఏ సినిమా బాగుందో, ఏ సినిమా బలహీనమో క్షణాల్లో ఆడియన్స్ ముందే తెలుసుకుంటున్నారు.
ఇప్పటికి కంటెంట్ మెయిన్ ఫాక్టర్‌గా మారిపోయింది. చిన్న సినిమా అయినా మంచి కథ ఉంటే ఆడియన్స్ దాన్ని సూపర్ హిట్ చేస్తుంటారు. కానీ కంటెంట్ లేకపోతే ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సినిమాకి ప్లవర్ ఉండదు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు అలాంటి పరిస్థితి ఎదురైంది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే, నాజర్, జోజు జార్జ్ వంటి ప్రముఖులతో రెట్రో అనే సినిమా విడుదలైంది. గత కొన్ని సినిమాల్లో పెద్ద విజయాలు అందుకోలేక ఇబ్బంది పడ్డ సూర్య, పూజా ఈ సినిమాతో మంచి ఫలితాలు ఆశించారు. కోలీవుడ్ మీడియా, సూర్య ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ రోజే రెట్రోకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఆసక్తి కనబరచక, థియేటర్స్ నుంచి కూడా కొంత మంది బయలుదేరారు. తమిళనాడులో కూడా తొలి వారం అద్భుత ప్రదర్శన జరగక, సగటు వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అదే రోజు విడుదలైన మరో చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. డైరెక్టర్ అభిషన్ రూపొందించిన ఈ సినిమా స్టార్ కాస్టింగ్ లేకపోయినా కంటెంట్ వలన మంచి ప్రాధాన్యత తెచ్చుకుంది. శశికుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, మంచి ప్రివ్యూలు, మౌత్ టాక్ వల్ల కలెక్షన్లు పెరిగాయి. మొదటి రోజు రూ. రెండు కోట్లు క్లోజ్‌గా వసూలు చేసి, ఇప్పటి వరకు రూ. 60 కోట్లు క్రాస్ చేసింది.
తమిళనాడులో సూర్య సినిమా రెట్రో కంటే టూరిస్ట్ ఫ్యామిలీ ఎక్కువ వసూళ్లు రాబట్టిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే వరకూ చిన్న సినిమా కూడా కంటెంట్ ఆధారంగా పెద్ద విజయం సాధించగలదనే మెసేజ్‌ను అందిస్తోంది.
Recent Random Post:














