
టాలీవుడ్ ప్రేక్షకులకు ‘దేవర’, ‘ఆదిపురుష్’ చిత్రాల ద్వారా విలన్‌గా పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మాత్రం ఇంకా హీరోగా మంచి డిమాండ్ కలిగి ఉన్నాడు. సేక్రెడ్ గేమ్స్ వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఒక మలయాళ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడనే వార్త బోలెడంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే 2016లో విడుదలైన మోహన్ లాల్ నటించిన ఒప్పం. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ డబ్ అయ్యింది.
ఇప్పుడీ సినిమాను సైఫ్‌తో రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో ప్రియదర్శన్ మళ్లీ దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పం రీమేక్‌గా అనడంలేదు గానీ, సైఫ్ “అంధుడిగా నటించబోతున్నా” అని చెప్పడం, డైరెక్టర్ అదే కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.
అయితే, దాదాపు దశాబ్దం క్రితం వచ్చిన చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలన్న యత్నం పై సినీ విశ్లేషకుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బాలీవుడ్లో చాలా రీమేక్ చిత్రాలు ఫెయిల్ అయిన దృష్ట్యా — ఉదాహరణకు: అల వైకుంఠపురములో, జెర్సీ, ఛత్రపతి, రాక్షసుడు — ఇప్పుడు ఓటిటీలో అందుబాటులో ఉన్న ఒప్పంను రీమేక్ చేయడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తదుపరి వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Recent Random Post:















