
బెంగళూరులో జరిగిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈస్ట్ పాయింట్ కళాశాలలో జరిగిన ఈ కచేరీలో, ఓ అభిమాని బిగ్గరగా “కన్నడ పాట పాడండి” అంటూ పదేపదే కోరడం సోనును ఆగ్రహానికి గురిచేసింది. స్పందనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన విమర్శలకు దారితీస్తున్నాయి.
వెంటనే ప్రదర్శన ఆపిన సోను నిగమ్, “ఇలాంటి తీరుతోనే పహల్గాం దాడులు జరుగుతాయి. ఏదైనా డిమాండ్ చేయక ముందు మీ ముందున్న వ్యక్తిని గౌరవించండి” అని వ్యాఖ్యానించారు. ఇది చాలా మందికి అసహనాన్ని కలిగించింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక చిన్న అభ్యర్థనను జాతీయ విషాదంతో పోల్చడం సరైనది కాదు”, “ఇది హిందీ ఆధిపత్యం చూపే ఉదాహరణ”, “సెలబ్రిటీగా బాధ్యతగా స్పందించాలి” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో సోను నిగమ్‌కు మద్దతు తెలిపే అభిమానులు కూడా ఉన్నారు. ఆయన గతంలో కన్నడ సంగీతానికి చేసిన సేవలను, రాష్ట్రానికి పట్ల చూపిన గౌరవాన్ని గుర్తుచేస్తున్నారు. సోనూ స్వయంగా కూడా స్పందిస్తూ, “నా కొన్ని ఉత్తమ గీతాలు కన్నడలోనే ఉన్నాయి. కర్ణాటక ప్రజలపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంది” అని తెలిపారు.
ఈ సంఘటన, భాష, ప్రాంతీయ గౌరవం, మరియు ప్రజల ఎదురుచూసే సెలబ్రిటీల బాధ్యతల గురించి మళ్ళీ చర్చకు తావిచ్చింది. ఈ వివాదం త్వరలో వీడేలా కనిపించదు.
Recent Random Post:















