స్వేచ్ఛగా జీవించడమే నిజమైన విజయం – సమంత

Share


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారింది. ఒకప్పటి మయోసైటిస్ సమస్యను అధిగమించి, తిరిగి సినిమాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సమంత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా తన కెరీర్, జీవిత పరమైన దృష్టికోణాన్ని పంచుకుంది.

సక్సెస్ అనేది కేవలం విజయాలను సాధించడం మాత్రమే కాదని, నిజమైన విజయం అంటే సామాజిక పరిమితులను అధిగమించి స్వేచ్ఛగా జీవించడం అని సమంత అభిప్రాయపడింది. “మనకు నచ్చిన విధంగా జీవించడమే అసలు విజయము. వేరొకరు వచ్చి ‘నువ్వు సక్సెస్ అయ్యావు’ అని చెప్పే వరకు వేచిచూడాల్సిన అవసరం లేదు,” అంటూ స్పష్టంగా పేర్కొంది.

ఆడవారికి నిర్దిష్టమైన హద్దులు విధించడం సరికాదని, జీవితంలో వివిధ పాత్రలను సమర్థవంతంగా పోషించడం వల్లే నిజమైన విజయాన్ని పొందవచ్చని చెప్పింది. యువతతో మాట్లాడుతూ, తాను చిన్నతనంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో చదవాలని కలలు కన్నానని, కానీ అనుకోకుండా నటిగా మారి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం తన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది.

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి, ప్రేక్షకులకు గొప్ప కథలతో చిత్రాలను అందించడానికి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని సమంత వెల్లడించింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే యాక్షన్ సినిమాకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. అంతేకాక, తన స్వంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం అనే సినిమా ప్రకటించగా, తాను నిర్మిస్తున్న తొలి చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది.


Recent Random Post: