హరిహర వీరమలు సినిమా మళ్ళీ వాయిదా: ఫ్యాన్స్ నిరాశ

Share


నిన్న హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాత్రి ఐపీఎల్ ఫైనల్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించి ట్రెండింగ్‌లోకి వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్లు, ప్రశంసలు, ట్రోలింగ్, కౌంటర్లు సోషల్ మీడియాలో కొనసాగాయి.

నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ఏ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, జూన్ 8న జరపాలని ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడడం, అలాగే డిస్ట్రిబ్యూటర్ల వద్ద విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం వాయిదా అనేది నిజమని నిరూపించింది. థియేటర్ల వద్ద జూన్ 12న సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్న పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు.

పని ప్రారంభమైన తర్వాత నుండి హరిహర వీరమల్లు సినిమాకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. ప్రాజెక్ట్ మొదలయ్యాక కొద్ది కాలంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. భారీగా నిర్మించిన సెట్లు తీవ్రమైన వర్షాలతో ధ్వంసమయ్యాయి. తరువాత అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ పై పూర్తి సమయం పెట్టలేక, బాధ్యతను రత్నంగారబ్బాయి జ్యోతి కృష్ణ అప్పగించాడు. ఈ గ్యాప్ సమయంలో పవన్ మూడు రీమేక్ సినిమాలు విడుదలయ్యాయి. అలా కాలం కదులుతూ చివరికి సినిమా పూర్తయ్యే సమయమొచ్చింది అనుకుంటున్నప్పుడు మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా విడుదల తేదీపై స్పష్టత లేదనే పరిస్థితి కొనసాగుతోంది.

వాయిదా పడటం సైలెంట్ గా జరిగితే బాగుంటే, థియేటర్ల బంద్ విషయంలో హరిహర వీరమల్లుపై ఎక్కువ ఫోకస్ వచ్చింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఆర్. నారాయణమూర్తి సహా పలువురు ఎగ్జిబిటర్లు మీడియాతో మాట్లాడి వివరణలు ఇచ్చారు, మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లే పక్కకు తప్పుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి ఎవరు మాట్లాడడం లేదు. అయితే, ఈ ఇష్యూను మళ్లీ ఎవరో తిరిగి తెచ్చి చర్చించకపోతే ఆశ్చర్యం కాదు.

ఇది హరిహరుడు పెట్టిన పరీక్షని తట్టుకోవడం మినహా, నిర్మాత ఏఎం రత్నం, అభిమానులకు ఇక మరొక దారి లేదు. జరిగేదంతా మంచి కోసం జరుగుతుందని నమ్మి ముందుకు వెళ్లాల్సిందే.


Recent Random Post: