
తెలుగు థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హిట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరింత భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మూడు భాగాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సిరీస్, మొత్తం ఏడు భాగాలుగా రూపుదిద్దుకుని, చివరికి గ్రాండ్ ఫినాలేతో ముగియనుందని డైరెక్టర్ శైలేష్ కొలు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఏడో భాగంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని హీరోలు ఒకే కథలో కలుసుకుని, అవెంజర్స్ స్టైల్‌లో కేసును సాల్వ్ చేయబోతున్నారనే సంకేతాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రథమ భాగమైన హిట్: ది ఫస్ట్ కేస్లో విశ్వక్ సేన్ తన గంభీర నటనతో ఫ్రాంచైజ్‌కు బలమైన పునాది వేశారు. ఆ తర్వాతి భాగంలో అడివి శేష్ మానసిక ఉత్కంఠను జోడించి కథను మరింత విస్తరించారు. ఇటీవల విడుదలైన హిట్ 3లో నాని నటన, కథన శైలి హిట్ ఫ్రాంచైజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి భాగంలో వేర్వేరు పోలీస్ అధికారుల కథలను చూపిస్తూ, ఒకే యూనివర్స్‌లో కేసులు, సూచనలు, లింక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హిట్ 3 క్లైమాక్స్‌లో తమిళ స్టార్ హీరో కార్తీని ఫిక్స్ చూపించి, హిట్ 4లో అతనే హీరో అని క్లూ ఇచ్చారు. హిట్ 4తో ఫ్రాంచైజ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భాషా హద్దులను దాటి, క్రైమ్ థ్రిల్లర్ కథనాన్ని మరింత విస్తృతంగా చూపించేందుకు కార్తీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. హిట్ 4 తర్వాత మిగిలిన భాగాలు వరుసగా విడుదల కానున్నాయి. చివరికి ఏడో భాగంలో ఇప్పటివరకు వచ్చిన ఆరు మంది హీరోలు ఒకే కథలో భాగమవుతారని డైరెక్టర్ శైలేష్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం శైలేష్ కొలు, శ్రీకాంత్ తనయుడు మేక్ రోషన్తో ‘ఏమో ఏమో ఇది’ అనే ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే హిట్ 4 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై నాని నిర్మాతగా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజ్, నిర్మాణ పరంగా కూడా మంచి స్థాయిలో కొనసాగుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్రాంచైజ్‌లకు ఉన్న ఆదరణ పెరుగుతున్న వేళ, హిట్ సిరీస్ కొత్త ట్రెండ్‌కు నాంది పలికిందని చెప్పవచ్చు. ఒక్కో భాగంలో ఒక్కో కథ, ఒక్కో హీరో, తర్వాత ఒకే పెద్ద కథానికలో భాగమవుతుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. ఏడో భాగానికి ఏర్పాటైన గ్రాండ్ ప్లాన్ చూస్తుంటే, తెలుగు సినిమాల్లోనే తొలిసారి ఈ స్థాయిలో మల్టీ-హీరో యూనివర్స్ ముగింపును చూడబోతున్నామన్న అంచనాలు పెరుగుతున్నాయి. రాబోయే భాగాల్లో మరిన్ని క్రాస్ రిఫరెన్సులు, పాత కేసులకు కొత్త లింకులు, పాత్రల మధ్య అనుబంధాలు బయటపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా, హిట్ సిరీస్ సాధారణ క్రైమ్ థ్రిల్లర్ నుంచి విస్తృత సినీ యూనివర్స్‌గా మారబోతోందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Recent Random Post:















