మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ వల్ల ఆయన గత చిత్రం ‘ఆడుజీవితం'(ది గోట్ లైఫ్) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం కేరళలో ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం సంచలనంగా నిలిచిన విషయం తెల్సిందే.
కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం, అన్ని వర్షన్ లకు మంచి స్పందన రావడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ది గోట్ లైఫ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
థియేట్రికల్ రిలీజ్ సమయంలో వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సినిమా విడుదల అయ్యి దాదాపు వంద రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా ది గోట్ లైఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
సాధారణంగా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా స్ట్రీమింగ్ చేస్తే ఓటీటీ లో కూడా మంచి ఫలితం లభిస్తుంది. వంద రోజులు ది గోట్ లైఫ్ సినిమా పూర్తి చేసుకుంది. జనాలు ఓటీటీ లో చూడాలని కోరుకున్న వారు కూడా మెల్ల మెల్లగా మరిచి పోయే అవకాశం ఉంది.
ఇంతకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎందుకు అవ్వలేదు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మలయాళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉన్నా కూడా నిర్మాతలు రేటు విషయంలో రాజీ పడటం లేదట.
సినిమా ఎలాగూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది, వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.. కనుక ప్రేక్షకులు భారీగా చూస్తారు, కనుక భారీగా ఓటీటీ రైట్స్ ద్వారా సంపాదించాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ కారణంగానే ది గోట్ లైఫ్ ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వలేదు అనేది టాక్.
Recent Random Post: