హిట్3 విజయం – నాని, శేష్ బంధం హైలైట్

Share


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించి నిర్మించిన ‘హిట్ 3’ సినిమా మే 1న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో రికవరీ అయింది. అందరూ సేఫ్ అయ్యారని, లాభాల బాట పట్టారని అంటున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘హిట్ 2’ హీరో అడివి శేష్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. హిట్ 2లో ‘కేడీ’ పాత్రతో ఆకట్టుకున్న శేష్, హిట్ 3లో నాని ప్రమాదంలో ఉన్న సమయంలో అతనికి సపోర్ట్‌గా వచ్చి కనిపిస్తాడు. చిన్న క్యామియో అయినా, అతని ఎంట్రీ పలు ప్రశంసలు పొందుతోంది.

ఇటీవల అడివి శేష్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో నాని‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్” అంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. హాస్పిటల్ లో ఇద్దరూ ఉన్నప్పుడు తీసిన ఆ ఫోటోను హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి తీయగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శేష్ ప్రస్తుతం ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఎప్పటిలానే కంటెంట్ ఆధారిత సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్న ఆయన, ఈ రెండు చిత్రాలతో మంచి హిట్ అందుకోవాలనే ఆశ పెట్టుకున్నారు.


Recent Random Post: