దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎంత బలంగా పనిచేసిందో తెలిసిందే. ఆ పాదయాత్ర తోనే మొట్ట మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే సెంటిమెంట్ ని తనయుడు జగన్ మోహన్ రెడ్డి పాటించి ఆయన సీఎం అయ్యారు. వాళ్లిద్దరి దారిలో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ప్రస్తుత మంత్రి లోకేష్ కూడా కొన్ని కిలోమీటర్లు పాద యాత్ర చేసారు. అలా చేయడంతోనే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
మరి వీళ్లందరి మార్గంలోనే తలపతి విజయ్ కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నాడా? ఈయన తమిళనాట పాద యాత్రకు రెడీ అవుతున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. తమిళగ వెట్రికళగం పార్టీ స్థాపించి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గురించి సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. ఒంటరిగా వెళ్లాలా? పొత్తుతో వెళ్లాలా? అన్నది ఇంకా క్లారిటీ లేదు . కానీ సమయం ఆసన్నమవుతుండటంతో వ్యక్తిగతంగా తాను జనాల్లోకి బలంగా వెళ్లాలని మాత్రం సంకల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ కి పాదయాత్ర ఆలోచన తట్టినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిలో భాగంగా పార్టీకి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారుట. అలాగే రెండు లక్షల మందికి పదవులు కట్టబెట్టే ప్రణాళికలోనూ ఉన్నారుట. ఇప్పటికే పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని విజయ్ ఆశ్రయించారు. ఈసీ నుంచి ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
అక్కడ నుంచి క్లారిటీ రాగానే భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో ఓ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ఈ సభలోనే పార్టీ ఉద్దేశాలు, సిద్దాంతలు గురించి చెప్పాలనుకుంటు న్నారుట. విజయ్ పాద యాత్ర చేస్తే సంలచల నమవుతుంది. ఇంతవరకూ ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో కొనసాగారు. కానీ ఏ నటుడు పాదయాత్ర చేసి అధికారంలోకి రాలేదు. తొలిసారి వైఎస్ తరహాలో పాదయాత్ర చేసి సీఎం పీఠం చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
Recent Random Post: