హ్యాండ్సమ్ హీరోతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ట్రై చేయబోతున్నారా.?


అక్కినేని అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి గత చిత్రాల మాదిరిగా ‘#అఖిల్5’ ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్ ‘కిక్’ ‘రేసుగుర్రం’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తారట. ఇందులో అఖిల్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ అందరి రెమ్యూనరేషన్లతో కలిపి 60 కోట్లు పైనే అవ్వచ్చని టాక్. ఇదే కనుక నిజమైతే ఇంత పెట్టుబడి అఖిల్ సినిమా మీద పెట్టి వెనక్కి తీసుకోవాలంటే సినిమాపై ఎక్కడా నెగిటివ్ టాక్ అన్నదే రాకుండా చూసుకోవాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అఖిల్ సరసన ముంబై మోడల్ సాక్షి వైద్యని హీరోయిన్ గా తీసుకున్నారని.. కాదు రష్మిక మందన్నా హీరోయిన్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చి దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Recent Random Post: