సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు చాలా సాధారణం అయ్యాయి. కొంతమంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, కొంతమంది పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడాకులు తీసుకుంటారు. మరికొందరు ఏళ్ల తరబడి కుటుంబ జీవితంలో సంతోషంగా జీవించిన తర్వాత కూడా ఆకస్మికంగా విడాకులు తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా అలాంటి జాబితాలో మలయాళ నటుడు షిజు ఏఆర్ కూడా చేరారు.
17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, ఆయన భార్య ప్రీతి ప్రేమ్తో విడాకులు తీసుకున్నట్లు షిజు ఇంటస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ప్రకారం,
“మేము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. భార్యాభర్తలుగా విడిపోయినా, మేము మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాము. మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా దయచేసి పుకార్లు సృష్టించకండి. ఇకపై విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాము” అని తెలిపారు.
షిజు మరియు ప్రీతి కథ మాత్రం కొంత ప్రత్యేకంగా ఉంది. మొదటగా, సినిమా సెట్స్‌లో కలిసిన వీరు సినిమా స్టైల్‌లో ఒకరికొకరు “నువ్వంటే నాకిష్టం” అంటూ ప్రేమ పంచుకున్నారు. షిజు ముస్లిం, ప్రీతి క్రిస్టియన్ కాబట్టి కుటుంబ సభ్యులు వివాహానికి వ్యతిరేకంగా ఉండగా, ప్రీతి వ్యక్తిత్వం ఎక్కువ అని భావించి మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. తరువాత ఒక కూతురు పుట్టింది. కూతరు పుట్టాక కుటుంబ సభ్యుల అంగీకారం తో సాంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు తీసుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. మతాలు వేరు అయినా ప్రేమతో వివాహం చేసుకున్న జంట ఇలా విడాకులు తీసుకోవడం పలు సందేహాలు, చర్చలకు దారితీస్తోంది. కొంతమంది కామెంట్ చేస్తూ, “వయసులో కూతురు ఉన్నప్పుడు ఇది ఆమె మానసిక పరిణామంపై ఎంత ప్రభావం చూపుతుందో మీరు గుర్తించరా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా, బంధానికి పులిస్టాప్ పెట్టడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

Recent Random Post: